అడ్డంగా దొరికిపోయిన ఆ రెండు ఛానెల్స్ ! బయటపెట్టిన కోబ్రాపోస్ట్     2018-05-26   23:23:24  IST  Raghu V

ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడంలో మీడియా ఆరితేరిపోయింది. తాము చూపించిందే నిజం .. మేము పంది అంటే పంది.. నంది అంటే నంది అనే స్థాయిలో మీడియా సామ్రాజ్యం విస్తరించిపోయింది. అయితే మీడియా లో వస్తుంది అంతా నిజం కాదు అని ప్రజలకు తెలిసినా పదే పదే అదే చూపిస్తుండడంతో నమ్మకతప్పని పరిస్థితి. అయితే ఆ ఆటలు ఎంతకాలమో సాగవు కదా ! స్ట్రింగ్ ఆపరేషన్ లు చేయడంలో ఆరితేరిపోయిన మీడియా కు అదే స్ట్రింగ్ ఆపరేషన్ తో కంగు తినిపించారు. అందులో రెండు ప్రధాన తెలుగు మీడియా ఛానెల్స్ అడ్డంగా బుక్కయ్యాయి.

కోబ్రా పోస్ట్ చేపట్టిన ‘క్యాష్ ఫర్ కవరేజ్’ అనే స్ట్రింగ్ ఆపరేషన్ లో దేశవ్యాప్తంగా ప్రముఖ వార్తా సంస్థలైనా 25కు పైగా న్యూస్ నెట్‌వర్క్స్‌పై కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. హిందుత్వ వార్తలు ప్రసారం చేస్తే, భారీ స్థాయిలో డబ్బులిస్తాం.. అనే ఎరతో ఈ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించినట్టుగా కోబ్రా పోస్ట్ ఎరవేసింది. ‘ఆపరేషన్ 136’ పేరుతో ఇప్పటికే కొన్ని ఛానెల్స్ బండారం కోబ్రా పోస్ట్ బయటపెట్టింది. అలాగే ఏడు టీవీ ఛానెల్స్, ఆరు పత్రికలు, మూడు వెబ్ పోర్టల్స్ తోపాటు ఒక ఏజెన్సీని తొలివిడతగా బయటపెట్టింది.