పీరియడ్స్ లో ఆమె కోరికను అస్సలు కాదనొద్దు .. ఎందుకంటే?

పీరియడ్స్ లో అమ్మాయిలు చాలా కామన్ గా ఎదుర్కొనే సమస్యలు మూడ్ స్వింగ్స్, క్రాంప్స్. మూడ్ స్వింగ్ వారిని మానసికంగా ఇబ్బందిపెడితే, క్రాంప్స్ శారీరకంగా ఇబ్బందిపెడతాయి. మూడ్ స్వింగ్స్ వలన ఏమోషన్స్ కంట్రోల్ లో ఉండవు. ఒక్కసారిగా కోపం రావొచ్చు, మరిక్షణమే ప్రేమగా మాట్లాడవచ్చు, ఒక్కోసారి అనుకోకుండా శృంగార వాంఛ కలగవచ్చు.
ఆ శృంగార వాంఛ కేవలం కోరికలో పుట్టేది కాదు, నొప్పి వలన కూడా కావచ్చు. అదే మామూలు టైమ్ లో, అమ్మాయిలకి, పీరియడ్స్ లో ఉన్న అమ్మాయిలకి తేడా.

పీరియడ్స్ క్రాంప్స్ వలన భయంకరమైన నొప్పిని అనుభవిస్తారు అమ్మాయిలు. ఈ నొప్పి నుంచి తప్పించుకునేందుకు రకరకాల టెక్నిక్స్, డైట్ మెథడ్స్ ఉన్నా , వాటి మీద అందరికి విజ్ఞానం ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో చాలామందికి తెలిసిన ఏకైక టెక్నిక్, హస్తప్రయోగం. అవును, హాస్తప్రయోగం క్రాంప్స్ లో వచ్చే నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. అదే భాగస్వామి ఉంటే, హస్తప్రయోగానికి బదులు సెక్స్ చేయవచ్చు.

కాబట్టీ, ఇలాంటి సమయంలో అమ్మాయిలు శృంగారాన్ని కోరుకున్నా కోరుకుంటారు. అలాంటి సమయంలో, వారి శారీరక, మానసిక స్థితిని అర్థం చేసుకోవడం మగవారి బాధ్యత అని చెప్పాలి. అందుకే, పీరియడ్స్ సమయంలో అమ్మాయిల, ఆ కోరిక కొరితే కాదనకూడదు. వారి ఇబ్బందిని అర్థం చేసుకోని సహకరించాలి. లేదంటే నొప్పి తగ్గదు, అలాగే మూడ్ స్వింగ్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయి.