బ్రోకర్ పనులు చేస్తున్న ఆ లేడి డైరెక్టర్ ఎవరు?     2017-11-03   01:38:31  IST  Raghu V

A lady director who worked as $ex broker

అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి సంచలనమో మీకు తెలుసు, మాకు తెలుసు. ఆ సినిమాలో విశేషం ఏమిటంటే, అందులో పనిచేసిన హీరో, హీరోయిన్, దర్శకుడు మాత్రమే కాదు, టెక్నిషయన్స్ కూడా బాగా బిజీ అయిపోతున్నారు. ఆ సినిమాలో పాటలు రాసిన గేయరచయితలు కూడా బిజీ అయిపోతున్నారు. అందులో “మధురమే ఈ క్షణమే” అంటూ సాగే ఓ పాట గుర్తిందిగా? ఆ పాటని రాసింది శ్రేష్ఠ అనే అమ్మాయి. ఆశ్చర్యపోతున్నారా? అసలు గేయరచయిత అనగానే ఎప్పుడు మగవారు తప్ప ఆడవారు కనిపించరు, అలాంటి ఓ అమ్మాయి గేయాలు రాయడం, అందులోనూ అలాంటి శృంగార గేయం రాయడం ఏంటని అనుకుంటున్నారా? శ్రేష్ఠ ఇప్పుడు ఓ బిజి లిరిక్ రైటర్. కాని ఆమె ప్రయాణం సులువుగా మొదలవలేదు.

సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందో మీకు తెలియనిది కాదు. హీరోయిన్లకే అనుకున్నాం, శ్రేష్ఠ కి కూడా అలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయాట. అబ్బాయిలని మాత్రమే కాదు, అమ్మాయిలని కూడా నమ్మడానికి వీల్లేదు అంటోంది శ్రేష్ఠ.

ఓ లేడి డైరెక్టర్ శ్రేష్ఠని గోవాకి రమ్మని పదే పదే ఫోన్ చేసిందట‌. గోవా వస్తే ఇక్కడ ఒక సర్ ప్రైజ్ ఉందని, ఓ అబ్బాయి నీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడని పదే పదే స్ట్రెస్ చేసే సరికి వెళ్ళిందట శ్రేష్ఠ. అక్కడికి వెళ్ళేసరికి, అసలు తనని ఇంతవరకు కలవని అబ్బాయి అలాంటి “కోరిక” కోరడంతో ఖంగు తినింది ఈ లిరిక్ రైటర్. ఒక లేడి డైరెక్టర్ అంతా తెలిసి, ఓ అమ్మాయిని ఇలా ప్రమాదంలో పడేయటం ఏంటని ఆశ్చర్యపోయినా, ఆ తరువాత ఇండస్ట్రీ చెడ్డ వారు కేవలం మగవారే కాదని తెలుసుకుంది. ఓ నిర్మాత అవసరం తీర్చమని ఓసారి స్వయంగా ఆయన భార్యే అడిగిందట. ఉంటారండి, ఇలాంటి వారు కూడా ఉంటారు.

ఇక ఆ నిర్మాత ఎవరో తెలియదు కాని, మా అంచనా ప్రకారం ఆ లేడి డైరెక్టర్ ఎవరో కాదు, మొదటి సినిమాతోనే ఓ యువ క్రేజి హీరో బ్లాక్ బస్టర్ అందుకోని, ఆ తరువాత వరుస ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్. ఇది కేవలం మా అంచనా మాత్రమే. BBC కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రేష్ఠ పేర్లు బయటపెట్టకుండా ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చింది.