A heroine’s PR team behind gossips on Kajal Agarwal ?

ఎప్పుడో కళ్యాణ్ రామ్ లక్ష్మి కల్యాణంతో పరిచయమైంది కాజల్ అగర్వాల్. వచ్చిన ఏడాది, ఏడాదిన్నరకే పెద్ద హీరోయిన్ గా ఎదిగిపోయింది. ప్రస్తుతం టాలివుడ్ లో ఉన్న టాప్ 6 హీరోలందరితోనూ నటించిన ఏకైక హీరోయిన్ కాజలే. అదికాకుండా ఇప్పటి కథానాయికలలో మెగాస్టార్ చిరంజీవితో నటించే అరుదైన అవకాశం కూడా దక్కించుకుంది కాజల్. గబ్బర్ సింగ్ లోని ఫేమస్ డైలాగ్ లాగా, అమ్మడు వచ్చి పదేళ్ళైనా ఇంకా పవర్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికి పెద్ద పెద్ద అవకాశాలు ఎగరేసుకోపోతోంది. తమిళంలో టాప్ హీరోలు అజిత్ – విజయ్ లతో సినిమాలు చేస్తోంది కాజల్. తెలుగులో నేనే రాజు నేనే మంత్రి విడుదలకి సిధంగా ఉండగా, కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా ఇటివలే మొదలైంది.

ఇలాంటి ఫామ్ లో ఉన్న కాజల్ పై ఈమధ్య చాలా వదంతులు వస్తున్నాయి. కాజల్ బాలివుడ్ ప్రముఖుల ముందు టాలివుడ్ ని వెక్కిరించింది అని, సర్జరీలు చేయించుకుంటోంది అని, ఒక ప్రముఖ టాలివుడ్ హీరోతో అఫైర్ నడుపుతోందని … ఇలా రకరకాల వార్తలు కాజల్ గురించి ఈమధ్య వినిపిస్తున్నాయి. అయితే ఇవన్ని ఒట్టి అబద్ధాలే అంటోంది కాజల్. కావాలని తన మీద ఇలాంటి వార్తలు ప్రచారం చేయిస్తున్నారని, కొత్తగా వచ్చిన హీరోయిన్లకు కూడా పోటిగా, పెద్ద సినిమా చేస్తూ ఉండటం వలనే, అది చూసి ఓర్వలేక తన మీదా పుకార్లు పుట్టిస్తున్నారని కాజల్ అంటోంది.

ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, కాజల్ మీద ఇలాంటి ప్రచారం చేయిస్తున్నది ఎవరు ? సహజంగా ఒక నటి పీఆర్ టీమ్ మరో నటి మీద గాసిప్పులు పుట్టిస్తుంది. ఇది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో నడుస్తున్న తంతు. మరి కాజల్ పై వస్తున్న రూమర్లు ఏ హీరోయిన్ పీఆర్ టీం సృష్టిస్తోంది ? కొంపదీసి, కాజల్ తో గొడవలున్న ఒక తెలుగు టాప్ హీరోయిన్ అయితే కాదు కదా !