బయోపిక్‌ల పరువు తీస్తున్నారుగా..!     2018-06-17   03:30:37  IST  Raghu V

బాలీవుడ్‌లో గత కొంత కాలంగా వరుసగా బయోపిక్‌లు వస్తున్నాయి. ఇప్పటి వరకు హిందీలో వచ్చిన బయోపిక్‌లలో ఎక్కువగా విజయాన్ని సొంతం చేసుకున్నవే ఉన్నాయి. అందుకే బయోపిక్‌పై తెలుగు సినిమా పరిశ్రమ కూడా దృష్టి పెట్టింది. బాలీవుడ్‌ తర్వాత ఎక్కువగా బయోపిక్‌లు తెరకెక్కుతున్న ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమా పరిశ్రమ అని చెప్పుకోవచ్చు. ఇటీవలే సావిత్రి జీవిత చరిత్ర ‘మహానటి’ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఎన్టీఆర్‌, రాజశేఖర్‌ రెడ్డి, కత్తి కాంతారావుల జీవిత చరిత్రలను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇలా ప్రముఖుల జీవిత చరిత్రలు, గొప్ప పనులు చేసి చనిపోయిన వారి జీవిత చరిత్రలు తీస్తే పర్వాలేదు. కాని దిక్కుమాలిన జీవిత చరిత్రలు అన్ని కూడా తీస్తూ బయోపిక్‌ అంటూ పరువు తీస్తున్నారు. అనీల్‌ సుంకర ప్రస్తుతం నాని హీరోగా ఒక దొంగ బయోపిక్‌ను తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. 90 లలో తెలుగు రాష్ట్రం పోలీసులకు నిద్రలేకుండా చేసిన దొంగ జీవిత చరిత్రకు రంగం సిద్దం అవుతుంది. ఆ దొంగ పాత్రలో నటించేందుకు నాని కూడా సై అన్నాడు. త్వరలోనే ఆ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. 2019 చివర్లో లేదా 2020లో ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.