“హెచ్‌-4” వీసాలలో 93 శాతం మంది...“భారత ఎన్నారైలే”    2018-05-13   05:25:39  IST 

అమెరికా వంటి అగ్రరాజ్యంలో భారతీయుల హవా ఎంతగా ఉంటుంది అనడంతో ఈ మధ్యనే అమెరికా ప్రభుత్వం విడుదల చేస్తున్న వీసాల జారీ రిపోర్ట్ లు చెప్తున్నాయి..హెచ్ -1B వీసాని పొందటంలో చైనా సైతం మనకంటే వెనుక స్థానంలో ఉందంటే భారతీయుల ప్రతిభని అమెరికా ఎలా ఉపయోగించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు..పక్కా లెక్కలతో సహా హెచ్ -1B వీసా పొందిన వారిలో భారతీయులే అత్యధికులని తేల్చి చెప్పింది..

ఇదిలాఉంటే ఇప్పుడు హెచ్‌-4 వీసాలు పొంది వారిలో కూడా అత్యధికులు లిస్టు ప్రకటించింది అమెరికా ఈ సారి ఈ రిపోర్ట్ లో ఏకంగా భారత్ నుంచీ అమెరికాకి ఈ వీసా ద్వారా వచ్చిన వాళ్ళు ఏకంగా 93 శాతం మంది ఉన్నారని తాజా నివేదిక వెల్లడించింది. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల జీవిత భాగస్వాముల కోసం ఈ హెచ్‌-4 వీసాలు మంజూరు చేస్తారు. హెచ్‌4 వీసాలు పొందినవారిలో ఐదో వంతు కంటే ఎక్కువ మంది కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది.