8 signs that she is only using a boy

ప్రేమలో (ప్రేమ పేరుతో) కేవలం మగవారే మోసాలు చేయరు కదా. అమ్మాయిలు కూడా చేస్తుంటారు. అయినా ఇలాంటి విషయంలో అమ్మాయి – అబ్బాయి తేడాలుండవు. కొందరు మనుషులంతే, బాగా కన్నింగ్ మెంటాలిటి. ప్రేమ ప్రేమ అంటారు కాని నిజంగా ప్రేమ ఉండదు. ఆ వ్యక్తితో మనకేంటీ అవసరం, ఎలా వాడుకోవాలి .. ఇదే అలోచన ఉంటుంది. అలాంటి అమ్మాయి మీకు తగిలితే ఎలా కనిపెట్టాలో చూడండి.

* అబ్బాయి ఏదైనా విలువైన వస్తువు పోగొట్టుకున్నా, ఉద్యోగం పోగొట్టుకున్నా అబ్బాయి కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతుంది. ఇక తను వాటిని అనుభవించలేనన్న బాధతో.

* తన ఫ్యామిలికి అబ్బాయిని పరిచయం చేయడానికి జంకుతుంది. అసలు పరిచయం చేసే ఉద్దేశం కూడా ఉండదు. ఎప్పుడు వదిలేయాలో తనకు తెలుసు కదా.

* మీ ప్రపంచంలో కలిసి పోవడానికి ప్రయత్నించదు. మీ స్నేహితులు, మీ ఇష్టాలు .. వీటితో ఉండాలనుకోదు. ఎప్పటికీ మీతోనే ఉండే అమ్మాయి అయితే అలావాటు చేసుకోవాలనుకుంటుంది.