స్పైడర్ ఫ్లాప్ అవడానికి 8 ప్రధాన కారణాలు  

ఏడాదిన్నరగా ఊరించి ఊరించి వచ్చిన స్పైడర్ నెగటివ్ టాక్ సంపాదించుకుంది. కాని తెలుగులో మాత్రమే‌. తమిళంలో సినిమా టాక్ బానే ఉంది. ఇలా ఎందుకు? ఒకే సినిమా ఒక భాషలో హిట్ సూచికలు చూపిస్తోంటే, అదే సినిమా తెలుగులో ఎందుకు ఇంత ఘోరమైన టాక్ తెచ్చుకుంది. స్పైడర్ ఫలితానికి కారణం ఏమిటి? మా ప్రకారం 10. మీరేం అంటారు?

1) ఈ కథ మహేష్ బాబు ఎంచుకోవడం. విలన్ హీరోని డామినేట్ చేసే కథ ఇది. ఇంటలీజెన్స్ ఆఫీసర్ అంటే దేశంలోనే పెద్ద సమస్యలను డీల్ చేస్తాడు అనుకుంటాం. కాని ఇక్కడ ఒక సైకో కిల్లర్ ని డీల్ చేస్తారు. బేసిక్ గా, మహేష్ బాబు స్థాయికి తగ్గ కథ కాదు.

2) బడ్జేట్ అవసరానికి మించి పెట్టేసారు. ఇదే సినిమాని 50 కోట్లలో పూర్తి చేసి ఉంటే, 80-90 కోట్లకి అమ్మేసుకునేవారు. నష్టాలు తక్కువ వచ్చేవి. డిజాస్టర్ భయం ఉండేది కాదు. అలాగే అంచనాలు తక్కువ ఉండేవి.

3) జనాల్ని మోసం చేసిన ప్రోమోలు. రోబోటిక్ స్పైడర్ కి ఈ సినిమాలో స్థానమే లేదు. కేవలం ప్రోమోలో చూపించి డిజపాయింట్ చేసారు.‌ హాలివుడ్ సినిమా స్థాయిలో ప్రొజెక్ట్ చేసి మళ్ళీ దక్షిణాది సినిమానే చూపించారు. మహేష్ బాబుని పెద్ద ఆఫీసర్ లా ప్రొజెక్ట్ చేసారు. కాని తను ఐబి ఆఫీస్ లో ఓ చిన్న ఉద్యోగి. ప్రోమోలో చూపించిన ఫైట్స్ కేవలం ఓ పాటలో చుట్టేసారు.