రామాయణం నిజంగానే జరిగింది అని చెప్పడానికి 8 అద్భుత సాక్ష్యాలు Devotional Bhakthi Songs Programs    2017-05-03   06:16:57  IST  Raghu V

రామాయణం ఎప్పుడు జరిగింది ఎవరికీ తెలియదు. కొందరు వేల సంవత్సరాల క్రితం అంటారు, కొందరు లక్షల సంవత్సరాల క్రితం అంటారు మరికొందరు అసలు రామాయణం జరగనే లేదు, అంతా ఉత్తుత్తి కథే అని అంటారు. మనకు తెలిసినంతవరకు రామాయణం త్రేతాయుగంలో జరిగింది. మీతో ఎవరైనా అసలు రామాయణం జరగలేదు, రాముడు లేడు, రావణుడు లేడు అని వాదిస్తే, వారికి సమాధనమివ్వడానికి సమాచారం కావాలి కదా. అందుకోసమే రామాయణం నిజంగానే జరిగినట్టు నిరూపించే కొన్ని సాక్ష్యాలను మీ ముందుకి తెచ్చాం. అవేంటో చూడండి.

#1) హనుమంతుడి పాదముద్రలు :

హనుమంతుడు ఎంతటి బలశాలో మనం రామాయణంలో చదువుకున్నాం. హనుమంతుడు తన విశ్వరూపాన్ని దాల్చితే ఆయన ఎంత భారి ఆకారంలో ఉంటాడో కొన్ని కార్టూన్ సినిమాల్లో చూసాం. ఆ ఆకారానికి సరిపడే పాదముద్రలు ప్రపంచ నలుమూలల ఉన్నాయి. శ్రీలంక, మలేసియా, థాయ్ లాండ్, చివరకి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి. ఇంత పెద్ద పాదముద్రలు ఎలాగో మనుషులవి కావు. మరి హనుమంతుడివే అయితే రామాయణం నిజంగా జరిగినట్టే కదా ?