8 changes that happen to your body after death

మనిషి చనిపోయిన తరువాత ఏం జరుగుంటుంది ? ఏముంది గుండె ఆగిపోతుంది, రక్తం సరఫరా కాదు, లోనికి ప్రాణవాయువు వెళ్ళదు, మెదడు కూడా పనిచేయకపోవడంతో మనిషి శరీరం పనిచేయడం ఆగిపోతుంది. సాధారణ భాషలో దీన్నే ప్రాణం పోవడం అని అంటారు. మరి ఆ తరువాత ? కాలిస్తే బూడిత అవుతుంది, పూడిస్తే కుల్లిపోతుంది. మతవాదులు అయితే మనిషి శరీరంలోంచి ఆత్మ బయటకి వస్తుందని, అది తన కర్మఫలాన్ని అనుభవించేందుకు అయితే స్వర్గానికి లేదంటే నరకానికి వెళుతుందని చెబుతారు. మరికొందరైతే తీరని కోరికలు ఉన్న ఆత్మ భూమ్మీదే ఉండిపోతుందని, దెయ్యంగా మారుతుందని అంటారు. ఈ విషయాలకి ఎలాంటి ఆధారాలు లేవు. సైన్స్ ఇవేమీ నమ్మాదు. సైన్స్ అంటే గుర్తొచ్చింది .. మరి సైన్స్ ప్రకారం చనిపోయిన తరువాత శరీరంలో మార్పులు ఏమిటి ?

* ప్రాణవాయువు, రక్తం లేక అవయవాలు అన్ని పనిచేయడం మానేస్తాయి. మన ఒంట్లోని కణాలు మెల్లిగా నాశనం అవుతాయి.

* కండరాలు, నరాలు పనిచేయవు. శరీరంలో మిగిలిపోయిన మలమూత్రం ఏమైనా ఉంటే బయటకి వచ్చినా రావొచ్చు.

* చర్మం దగరికి బిగుసుకుపోతుంది. దాంతో గోళ్ళు. వెంట్రుకలు పెరిగినట్టుగా అనిపిస్తాయి. నిజానికి అవి పెరగవు. చర్మంలో మార్పుల వలన అలా అనిపిస్తుంది.

* గంటగంటకి శరీర ఉష్ణోగ్రత – 16 డిగ్రీలు పడిపోతూ ఉంటుంది.

* రక్త సరఫరా ఆగిపోయినా ఆకర్షణ శక్తి వలన రక్తం కిందికి జారుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎర్రటి ఛాయలు కనిపించవచ్చు. చర్మం యొక్క రంగు తెల్లగా ఉన్నవారిలో ఇది ఈజీగా కనిపెట్టవచ్చు.

* కొన్ని వారాల తరువాత (ఒకవేళ పూడిస్తే) జుట్టంతా రాలిపోతుంది. శరీరం యొక్క టెంపరేచర్ పడిపోతుంది. మీ శరీరం ఎంజీమ్స్ – బ్యాక్టీరియా రియాక్షన్ వలన కొంచెం గ్రీన్ కలర్ లోకి మారవచ్చు.

* పురుగులు మీ శరీరాన్ని 70% వరకైనా తినేస్తాయి. బ్యాక్టీరియా శరీరాన్ని తింటూ ఉండటం వలన అది నల్లగా మారవచ్చు.

* నాలుగు నెలల తరువాత ఆ శరీరంలో మాంసం ఏమి ఉండదు. అన్ని ఎముకలే ఉంటాయి.