6 things men hate in love making

శృంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఎవరికైనా ఇష్టమే. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, శృంగారం అనేది ఒక బేసిక్ హ్యుమన్ నీడ్. శృంగారంలో ఎవరికైనా నచ్చని విషయం ఉంటే అది శృంగారం జరిగే పద్ధతి కావచ్చు, శృంగారంలో తమ భాగస్వామి ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు. సహజంగా అయితే అబ్బాయిలకి శృంగారం ఆశ, ఇష్టం ఎక్కువ ఉంటాయని, ప్రతి అయిదు నిమిషాలకి ఒకసారైనా శృంగారం గురించి ఆలోచిస్తారని, వారికి శృంగారంలో నచ్చని విషయం అంటూ ఉండదని అంటుంటారు. కాని శృంగారంలో అబ్బాయిలకి నచ్చని విషయాలు కూడా ఉంటాయి. చూడండి అవేంటో …

* వినడానికి కొద్దిగా షాకింగ్ గా, అమ్మాయిలకి అయిష్టంగా అనిపించవచ్చు కాని, చాలామంది అబ్బాయిలకి ఓరల్ సెక్స్ అంటే ఇష్టం ఉండదు అంట. అలాగని ఎవరికి ఇష్టం ఉండదు అని కాదు. కొంతమంది ఇష్టంకొద్దే ఓరల్ సెక్స్ ఇస్తారు, కొంతమంది కేవలం భాగస్వామి సంతృప్తి కోసం ఇస్తారు, మరికొందరు ఇవ్వనే ఇవ్వరు.

* త్వరగా స్కలించడం ఏ అబ్బాయికి ఇష్టం ఉండదు. ఎంత కంట్రోలు చేసుకున్నా , ఎక్కువసేపు స్కలనాన్ని ఆపి ఉంచడం కష్టమే. త్వరగా స్కలించిన ప్రతీసారి చాలా గిల్టిగా ఫీల్ అవడం, ముభావంగా ఉండటం సహజంగానే అబ్బాయిలకి ఉండే అలవాటు.