6 basic tests to detect the reason behind vaginal itching

యోనిలో దురద అనేది చాలా కామన్ ప్రాబ్లం. దాదాపుగా అందరికి ఉండేదే. కాని కొంతమందిని ఈ సమస్య హద్దులు మీరి ఇబ్బందులు పెడుతుంది. నరకం చూపిస్తుంది. అలాంటివారు తక్షణమే ఈ సమస్యనుంచి తప్పించుకోవాలి. అలా తప్పించుకోవాలి అంటే ముందుగా దురద రావడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడే పరిష్కారం మార్గం సులువుగా అర్థం అవుతుంది. మరి కారణం ఏమిటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి ? టెస్టు చేయించుకోవాలి. ఇలాంటి విషయాల్లో అస్సలు మొహమాటపడకూడదు. మొహమాటంతోనే నష్టాన్ని కొనితెచ్చుకుంటారు జనాలు. ఈ యోనిలో లో దురద, అంటే వెజైనల్ ఇట్చింగ్ వెనుక కారణం కనిపెట్టేందుకు ఆరు బేసిక్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూడండి.

* స్వాబ్ టెస్టింగ్ :

ఇది కొద్దిగా క్లిష్టమైన పరీక్ష. కాని కంగారు పడొద్దు. మూడు స్పాంజ్ స్వాబ్స్ ని యోనిలో పెడతారు. ఆ తరువాత బ్లాడర్ లోకి మేతిలిన్ బ్లూ పంపించి, ఓ పది పదిహేను నిమిషాల తరువాత స్వాబ్స్ బయటకి తీసి వాటిని ల్యాబ్ కి పంపిస్తారు. అక్కడ ఆ స్వాబ్స్ మీద మైక్రోబయోలాజి టెస్టు నిర్వహించి కారణం ఏమిటో తెలుసుకుంటారు.

* ఫ్లూడ్ టెస్టింగ్ :

దురద, పుండ్లు, కురుపులు .. ఇలాంటి సమస్యలు తీవ్రం అయితే ఒకలాంటి ద్రవం బయటకి వస్తుంది. ఈ ఫ్లూడ్స్ ని తీసుకొని, దానిలోని ఇన్ఫెక్షన్ ఏమిటో, ఎలా వచ్చిందో చూస్తారు. ఈ పధ్ధతి కొన్ని ఎక్స్ ట్రీం కండిషన్స్ లో పాటిస్తారు.

* స్కిన్ బయోప్సీ :

సమస్య తీవ్రత, ఇన్ఫెక్షన్, లక్షణాలు .. అన్ని చర్మం మీదే కనిపిస్తే ఇన్ఫెక్షన్ సోకినా చర్మ కణాల్ని స్కిన్ బయోప్సి ద్వారా బయటకి తీస్తారు. వాటిని టెస్టు చేస్తారు.