అమెరికాలో 52 మంది భారతీయుల అరెస్ట్ ..     2018-06-21   03:50:06  IST  Bhanu C

అమెరికాలో కి అక్రమంగా చొరబడ్డారు అంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎంతో మందిని అరెస్టులు చేస్తున్న విషయం అమ్దరికియా విధితమే..అయితే ఈ అరెస్ట్ అయిన వారిలో 52 మంది భారతీయులు ఉన్నరనియా తెలుస్తోంది.. అయితే వారిలో ఎక్కువగా వాళ్లలో ఎక్కువ మంది సిక్కులు ఉన్నట్లు సమాచారం. మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడిన వీరు ఒరెగాన్‌ రాష్ట్రంలో ఆశ్రయం పొందడానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకొని ఫెడరల్‌ నిర్బంధ కేంద్రంలో ఉంచారు.

అయితే భారతీయులు నిర్భందంలో ఉన్నారన్న విషయం ముందుగా తెలియలేదు అయితే నిర్బంధ కేంద్ర సందర్శనానికి శనివారం వెళ్లిన చట్టసభ్యులు ఈ విషయాన్ని తెలిపారు..వీరితో కలిపి మొత్తం అక్కడ 123 మంది బందీలుగా ఉన్నట్లు వారు తెలిపారు…మిగిలిన వారంతా చైనా, మెక్సికో, నేపాల్‌, పాకిస్థాన్‌, ఉక్రెయిన్‌ తదితర దేశీయులని…అయితే వీరంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి వలస వచ్చారా అనేది తెలియరాలేదు. రోజులో 22 గంటలు ఒక చిన్న గదిలో ముగ్గురిని ఉంచుతున్నారని..వారి పరిస్థితి నరకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.