విమానాన్ని కూడా వదల్లేదు...ఆ 50 ఏళ్ల వ్యక్తి సడన్ గా లేచి విమానంలో చేసిన దానికి అందరు షాక్    2018-06-23   00:05:50  IST 

మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా బిచ్చగాళ్లు కామన్‌గా మనకు కనిపిస్తారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్ వద్ద, బస్టాండ్లలో, ఆలయాల వద్ద.. ప్రస్తుతం చిన్నపాటి హోటల్స్‌, కర్రీ పాయింట్ల వద్ద కూడా వారు ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో తిరిగే వారి దగ్గరకు బిచ్చగాళ్లు వచ్చి అడుక్కుంటూ ఉంటారు. ఈ క్రమంలో జాలి కలిగిన కొందరు వారికి డబ్బులు ఇస్తారు. కొందరికైతే అలా ఇవ్వడం నచ్చదు. వారు డబ్బులు లేవని పంపిస్తారు. మరి కొందరికి అసలు బిచ్చగాళ్లంటేనే పడదు. దీంతో వారు బిచ్చగాళ్లు దగ్గరికి వస్తే విసుక్కుంటారు. అయితే కొందరు మాత్రం బిచ్చగాళ్లకు దానం ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో ఉంటారు. ఇవ్వకపోతే బాగుండదేమో అనుకుంటారు. ఇస్తే.. ఛ.. అసలు అలాంటి వారికి ఎందుకు దానం చేశాం అని ఫీలవుతారు.

రోడ్లపై బిచ్చగాళ్ళు కనిపిస్తే పెద్ద వింతేమీ కాదు. కానీ విమానంలో కూడా అడుక్కుంటే అది షాకింగ్ వార్త అన్నట్టే. మీరు విన్నది నిజమే. అడుక్కోవడానికి కూడా ప్రదేశంతో సంబంధం లేదని నిరూపించాడు ఓ 50 ఏళ్ల మధ్య వయస్కుడు. ఇంతకూ ఇతను అడుక్కున్నది ఎక్కడనుకుంటున్నారు…ఆకాశంలో ఎగురుతున్న విమానంలో. అవును విమానంలోనే అడుక్కుంటున్నాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చేస్తూ వైరల్‌గా మారింది ఈ వీడియో.