“జగన్” చేసి చూపించాడు.. “చంద్రబాబు” జగన్ చేసేది చూస్తూనే ఉన్నారు..    2018-04-06   03:14:43  IST 

ఇచిన మాట నెరవేర్చడంలో ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని మరిపించేలా చేశారు రాజన్న తనయుడు వైఎస్ జగన్..ప్రత్యేక హోదా కోసం గత కొంతకాలంగా వైసీపి చేస్తున్న పోరు బాటలో ఆ సమయంలో ఏపీ ప్రజలకి చెపిన విధంగానే ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వని పక్షంలో మా ఎంపీలు అందరూ రాజీనామాలు చేస్తారు అని తెలిపారు..ఇప్పుడు ఆ మాటకి కట్టుబడి తమ ఎంపీలతో రాజీనామాలు చేయించి మోడీపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకువచ్చారు..అంతేకాదు వైసీపి ఎంపీల రాజీనామాలతో చంద్రబాబు ని జగన్ ఇరకాటంలోకి నెట్టేశారు..వివరాలలోకి వెళ్తే


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ముందు నుంచీ వైసీపి పోరాటం చేస్తుంటే అసలు స్పెషల్ స్టేటస్ వద్దు అంటూ అన్న చంద్రబాబు నాయుడు ఎక్కడ కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తుందో ఆ క్రెడిట్ అంతా జనసేన ,వైసీపి లకి వెళ్ళిపోతుందో అని బయపడి వెంటనే యూ టర్న్ తీసుకున్నారు..అయితే జగన్ ముందుగానే ప్రకటించిన విధంగా తన ఎంపీలు మిథున్ రెడ్డి – మేకపాటి రాజమోహన్ రెడ్డి – వైవీ సుబ్బారెడ్డి – అవినాశ్ రెడ్డి – వరప్రసాద రావు రాజీనామాలు చేయించేశారు..రాజీనామాలు చేసిన ఎంపీలు లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ను కలిసి తమ రాజీనామాలు అందచేశారు