ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టాలంటే ... ఈ ట్రిక్స్ పనికొస్తాయి  

ప్రతి రోజు, ప్రతి రాత్రి మనకు ఎదురయ్యే ఛాలెంజ్ .. త్వరగా నిద్రపోవడం. ఇక్కడ త్వరగా నిద్రపోవడం అంటే 8 గంటలకో, 9 గంటలకి నిద్రపోవడమో కాదు. నిద్రకు ఉపక్రమించిగానే నిద్ర పట్టడం. రాత్రి 10 గంటల సమయానికి నిద్రపోదామని బెడ్ మీదా వాలారనుకోండి. 10 గంటలకే నిద్రపట్టడం లేదు కదా. 11 అవొచ్చు, 12 అవొచ్చు. ఈరకంగా మన నిద్రలో ఒకటిరెండు గంటల్ని వృధా చేసుకుంటున్నాం. తద్వారా ఉదయం త్వరగా లేవాల్సివస్తే, నిద్ర అసంపూర్ణంగానే ఉండిపోతోంది. ఏడెనిమిది గంటల నిద్ర తీయాల్సింది పోయి, ఐదారు గంటల నిద్రతోనే సరిపెట్టుకుంటున్నాం. ఇది మనం అనుకున్నంత చిన్న సమస్య ఏమి కాదు. నిద్రలేమి చాలా పెద్ద సమస్య.

మరి ఇలా బెడ్ మీద సమయం వృధా కాకూడదు అంటే ఏం చేయాలి ? బెడ్ మీద వాలిన కొన్ని నిమిషాల్లోనే నిద్రలోకి జారుకోవాలంటే ఏం చేయాలి ? స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం ఒక మార్గమే అయినా, అది ప్రమాదకరం. అందుకే ఎలాంటి మందులు కాని డ్రగ్స్ కాని వాడకుండా, ఈజీగా నిద్ర ఎలా పోవాలో చెప్తాం చూడండి. సులువుగా నిద్రపట్టడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అందులో ప్రభావంతమైన అయిదు ట్రిక్స్ లేదా చిట్కాలను మీ ముందు ఉంచుతున్నాం. ఆ అయిదు ట్రిక్స్ లో మీకు ఏది సులభతరం అనిపిస్తే దాన్నే ఉపయోగించండి.