5 $ex Questions partners should ask each other

చాలామంది భాగస్వాములతో ఉన్న సమస్య ఏమిటంటే, $ex చేసేటప్పుడు $ex చేస్తారు కాని, $ex కి ముందు మరియు $ex ముగిసిన తరువాత మాట్లాడాల్సిన విషయాల మీద మాట్లాడరు. అడగాల్సిన ప్రశ్నలు అడగరు. అందుకే చాలా ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. వాటికి జవాబులు దక్కకుండా పోతాయి. $ex షురు చేసేముందు భాగస్వాములు మాట్లాడుకోవాలి. మధ్యలో పని పూర్తీ చేయాలి. అవసరమైతే మధ్యలో కూడా మాట్లాడుకోవాలి. పని పూర్తయిన తరువాత ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇంతకీ ఏం మాట్లాడాలి ? దేని గురించి మాట్లాడాలి ? ఆ ప్రశ్నలు ఏమిటి ? ఎలాంటి ప్రశ్నలు అడగాలి ? ఎందుకు అడగాలి ? ఓసారి చూడండి.

#1) ఎక్కువ హాయిని ఇచ్చే కామోద్రేక కేంద్రం ఏది ?:

మన శరీరంలో చాలా కామోద్రేక కేంద్రాలు ఉంటాయి. ఇవి ఆడవారిలో ఎక్కువ. అలాగని పురుషులకి ఉండవని కాదు. అందరికి ఒకే రకమైన స్పందనలు ఉండకపోవచ్చు. కొందరికి మెడ నరాలపై ముద్దులు మత్తుని, హాయిని ఇస్తాయి, కొందరికి ఇలాంటే స్పందనలు నడుము భాగంలో ఎక్కువ ఉంటాయి. ఇలా వ్యక్తీని బట్టి, ఎవరి స్పందనలు వారివి, ఎవరి శరీర అంగాలు వారివి. కాబట్టి మీ భాగస్వామికి ఎక్కడ తాకితే ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుందో అడగాలి. అడిగి తెలుసుకోవాలి. అప్పుడే శృంగారం రసవత్తరంగా ఉంటుంది. పచ్చిగా చెప్పాలంటే మీ భాగస్వామి శరీర భాగాలను మీరు అర్థం చేసుకోవాలి. ఏ శరీర భాగంలో తాకితే ఎలాంటి స్పందనలు కలుగుతున్నాయి బాగా గుర్తుపెట్టుకొని, ఎక్కడైతే అసలైన పాయింట్ ఉందొ, అక్కడ ఎక్కువ ధ్యాస పెట్టాలి.