5 requirements in your talk to attract her

అమ్మాయిలతో మాట్లాడటం ఒక ఆర్ట్. అది అందరికి వచ్చేది కాదు. అందుకే ప్రేమ వివాహాల కంటే పెద్దలు కుదిర్చిన వివాహాలే ఎక్కువ జరుగుతున్నాయి. ఈ కాలంలో అమ్మాయిల మీద ఓ ఇంప్రెషన్ పడేయటానికి పెద్దగా సమయం పట్టడం లేదు, కాని ఆ ఇంప్రెషన్ ని తమ మాటల ద్వారా కాపాడుకోవడమే కష్టం. మీ మాటల ద్వారానే అమ్మాయి ఒక ఇంప్రెషన్ ని మెయింటేన్ చేస్తుంది. అందుకే మాటల అల్లిక బాగా ఉండాలి. అమ్మాయికి విసుగు పుట్టకూడదు. ఇంకొంచెం సేపు ఈ అబ్బాయితో మాట్లాడితే బాగుండు అనిపించాలి. అలా అనిపించాలంటే ఈ 5 లక్షణాలు మీ మాటల్లో ఉండాలి.

* ఎంతసేపు మీ గురించే మాట్లాడకూడదు. ఈరోజు ఈ పని చేసాను. రేపు ఆ పని చేస్తాను. నేను అది, నేను ఇది. నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం లేదు. ఎంతసేపు మీ గురించి, మీ ఇష్టాల గురించేనా ? ఇలా మాట్లాడే మగవారినే Self Obsessed గా గుర్తిస్తారు అమ్మాయిలు. ఇలాంటి అబ్బాయిలకి ఈగో ఉన్నా లేకున్నా, వారికి ఈగో ఉంది అనుకుంటారు. అలాంటప్పుడు మీ మాటలు మీద ఆసక్తి సన్నగిల్లుతుంది. తన గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి.

* తన రోజు ఎలా గడిచింది తెలుసుకోండి. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతూ ఈరోజు ఏం చేయబోతోందో అడగండి. ఏదైనా పనిలో మీరు సహాయం చేయొచ్చో లేదో తెలుసుకోండి. ఒకే అంటే వెళ్లి సహాయం చేయవచ్చు. ఇంప్రెషన్ పెరిగేది ఇలానే. అలాగే రాత్రి అయితే ఆ రోజు ఎలా గడిచిందో అడగండి. దాంతో తానంటే మీకు చాలా పట్టింపు అని అర్థం అవుతుంది. కేర్ తీసుకునే అబ్బాయితో మాట్లాడటం ఏ అమ్మాయికైనా ఆసక్తికరంగానే ఉంటుంది.