మూత్రం ఆపి ఉంచడం వలన జరిగే 5 అనర్థాలు    2017-04-14   05:56:39  IST  Raghu V

మూత్ర విసర్జన ఎప్పుడు చేస్తాం? మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే చేయలేం కదా? అది ఎప్పుడు వస్తే అప్పుడే విసర్జన చేసేది. ఓ టైమ్ ఉండదు, ప్లేసు ఉండదు. ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఓరకంగా చెప్పాలంటే, మన శరీరానికి సంబంధించిందే అయినా, మన కంట్రోల్ లో ఉండని విషయం ఇది. మన అదుపులో పెట్టుకోలేకపోవచ్చు కాని, వచ్చినప్పుడు బయటకితోయడం మాత్రం చేయవచ్చు. అసలు మూత్రం ఎందుకు వస్తుంది? దానితో మన శరీరానికి పని ఏంటి ?

ఒంట్లో ఉన్న మలీనాల్ని కడిగి తనతోపాటు బయటకితీసుకెళ్ళే ద్రవపదార్థమే మూత్రం. అంటే మన ఒంటిలోని చెత్తను బయటకితీస్తుంది. మరి చెత్త ఎప్పటికప్పుడు బయటకితీయాలి కాని ఆపిపెడితే ఎలా ? కొందరికి కాదు, చాలామందికి మూత్రాన్ని ఆపివేసి ఉంచే అలవాటు ఉంటుంది. థియేటర్లో కూర్చుంటారు .. కాని ఒక్క సీన్ ఎక్కడ మిస్ అయిపోతుందో అని విరామం దాకా ఆపుకుంటారు. నిద్రలోకి కాస్త అనిపిస్తుంది .. కాని బద్దకంకొద్దీ అప్పుడే లేచి మూత్ర విసర్జన చేయరు. ఇది మంచి అలవాటు కాదు. దీనివలన ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా ? మీరే చూడండి.

#1) బ్లాడర్ మీద ఒత్తిడి :

మన మూత్రం శరీరంలోని టాక్సిన్స్, మలీనాల్ని సాధ్యమైనంతవరకు క్లీన్ చేస్తుంది. ఇది కొడ్నిల్లోంచి బ్లాడర్ లోకి వెళుతుంది. మన బ్లాడర్ ఎప్పుడు కూడా ఫుల్ అయితేనే మూత్రాన్ని బయటకి తోయమని ఫోర్స్ చేస్తుంది. అంతే తప్ప ఇష్టం వచ్చినప్పుడు బయటకి తోసే ప్రయత్నం చేయదు. మూత్రం వస్తోందన్నట్లు అనిపిస్తేనే అర్థం చేసుకోవాలి బ్లాడర్ ఫుల్ అయిపోతుంది, దాన్ని ఖాలీ చేయాలి అని. నార్మల్ గా, మనుషుల బ్లాడర్ 400 మిల్లీలీటర్ల నుంచి 600 మిల్లీలీటర్ల దాకా మూత్రాన్ని ఉంచుకోగలదు. ఆ లిమిట్ దాటిన క్షణం నుంచే బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అక్కడినుంచి మీరు ఎంతసేపు మూత్రాన్ని ఆపుకుంటే అంత ఒత్తిడి. అయినా మూత్రాన్ని ఆపాల్సినంత పని ఏముంటుంది ? మన శరీరం కోసం ఓ రెండు నిమిషాలు కేటాయించటం అంత కష్టమా? ఆఫీసు మీటింగుల ఉన్నాసరే, ఒక్కనిమిచం పర్మీషన్ అడిగి, ఒకే నిముషంలో పని పూర్తిచేసుకోవచ్చు. కాబట్టి బ్లాడర్ మీద ఒత్తిడి పెంచే పనలు చేయవద్దు. అలా చేస్తే ఏమవుతుందో, ఎన్ని అనర్థాలు జరుగుతాయో .. తరువాతి పాయింట్స్ లో చూడండి.