5 reasons why shedding tears is good for your health

మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి? ఏదైనా తట్టుకోలేకని భావోద్వేగం కలిగినప్పుడు వస్తాయి. అంటే భరించలేని దుఃఖం ఉన్నప్పుడు లేదా పట్టరాని సంతోషం కలిగినప్పుడు. బాధలో కారిస్తే ఏడుపు అంటాం, సంతోషంలో వస్తే ఆనందభాష్పాలు అంటాం. ఈ కన్నీరు కార్చడం అంటే అపశకుమని, ఇంటికి మంచిది కాదని ఏవేవో అంటారు. ఇక మగవారైతే ఎప్పుడు గాంభీర్యంగానే ఉండాలి తప్ప ఎడవకూడదని అని అంటారు. ఎడిచేవాడు మగాడే కాదని కూడా అంటారు. మగవారి కన్నీళ్లను టెస్ట్టోస్టీరోన్ హార్మోన్ కంట్రోల్ చేసి బయటకి ఎక్కువగా రాకుండా చేయొచ్చు కాని, మగవాడు కూడా ఏడుస్తాడు. కన్నీళ్లు అపశకునం కాదు, కేవలం ఆడవారి ఆస్తి కాదు. కన్నీళ్లు కూడా మంచివే. ఎలాగంటారా ?

టాక్సిన్స్ బయటకి :

మన శరీరంలోంచి మూడు రూపాల్లో టాక్సిన్స్ తీసుకొచ్చే ద్రవం బయటకి వస్తుంది. ఒకటి మూత్రం, రెండు చెమట, మూడు కన్నీరు. అంటే కన్నీటి ద్వారా కొన్ని మలీనాలు శరీరంలోంచి బయటకి వస్తాయి అన్నమాట. కన్నీరు శరీరంలోంచి కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్ ని ఉత్పత్తి చేసే కెమికల్స్ ని బయటకి తీస్తుంది. కాబట్టి మీ ఏడుపు ఎప్పుడు ఊరికే పోదు, కొంతవరకు టాక్సిన్స్ ని బయటకి తీసుకొనే పోతుంది.

మంచి చూపు :

కంట్లో కూడా డీహైడ్రషన్ ఉంటుంది తెలుసా. ఔను .. కళ్ళలో తేమ లేనప్పుడు మన చూపు మందగిస్తుంది. అప్పుడు లాక్రిమల్ గ్లాండ్ నుంచి వచ్చే కన్నీరు మన కనుగుడ్లని లుబ్రికేట్ చేస్తుంది. లిడ్స్ ని కడిగి మన చూపుని మెరుగుపరుస్తుంది. కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయ్యే జనాలకి కంటిచూపు బాగా ఉంటుందని అందుకే సైన్స్ చెబుతోంది. ఓ అద్దాన్ని నీటితో శుభ్రపరిచాక ఎలాగైతే మనకు అన్ని క్లియర్ గా కనిపిస్తాయో, కనుగుడ్లు అంతే, కన్నీటితో కడిగాక చూపు మెరుగుపడుతుంది.