హరితేజ బిగ్ బాస్ లో ఓడిపోవడానికి 5 పెద్ద కారణాలు

హరితేజ .. బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పుడు బహుషా ఎవరు పెద్దగ అనుకోలేదు ఈ అమ్మాయ టాప్ పోటిదారుల్లో ఒకరిగా నిలుస్తుందని. కాని అందరితో కలుపుగోలుదనం, మాటల్లో చలాకితనం, మ్యెచురీటి, ఎప్పుడు ఉల్లాసంగా ఉండే గుణంతో ప్రేక్షకులని ఆకట్టుకుంది హరితేజ. ఇక బిగ్ బాస్ ఇంటి గురించి బుర్రకథ ఎప్పుడైతే చెప్పిందో, హరితేజ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. నామినేట్ అయినా, అత్యధిక ఓట్లు పొందుతూ, బిగ్ బాస్ ఫినాలేలో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది హరితేజ. టాప్ 2 లో హరితేజ ఉండటం ఖాయమని, తను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా కూడా నిలిచే అవకాశాలున్నాయని అంతా భావించారు. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, హరితేజ టాప్ 2 లోకి రాలేకపోయింది. సడెన్ గా ఇంత మార్పు ఎందుకు వచ్చింది? హరితేజ ఓడిపోవడానికి కారణాలు ఏమిటి?