5 genuine apps to earn money

మీ మొబైల్ ఫోన్ లో ఎన్నో యాప్స్ ఉంటాయి కదా. సినిమాలు చూడ్డానికి కొన్ని యాప్స్, టీవి చూడ్డానికి కొన్ని యాప్స్, ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి కూడా కొన్ని యాప్స్ వాడుతుంటారు కదా. మరి డబ్బులు సంపాదించడానికి కూడా కొన్ని యాప్స్ వాడితే తప్పేంటి ? ఇంట్లో కూర్చొనే కొన్ని ఖర్చులకి డబ్బు సంపాదించవచ్చు. ఈ 5 యాప్స్ తో అది సాధ్యపడుతుంది.

* Dream 11 :

క్రికెట్ పిచ్చి మీ అందరికి ఉంటుంది. ఆ మ్యాచ్ చూస్తూనే డబ్బు సంపాదించండి. కేవలం వందలు కాదు, వేలు, కుదిరితే లక్షల్లో కూడా సంపాదించవచ్చు. తక్కువ డబ్బులు బెట్టింగ్ మీద పెట్టి ఎక్కువ మొత్తం పొందండి. మీకు క్రికెట్ పరిజ్ఞానం ఉండి, ఏరోజు టీమ్ ఎలా ఆడుతుంది బేసిక్ అంచనా ఉంటే చాలు. డబ్బులే డబ్బులు. అయితే ఇందులో అకౌంట్ ఉండాలంటే PAN కార్డు కంపల్సరి. అది ఉంటేనే మీ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు పడతాయి.

* Sidejoy :

ఈ యాప్ లో మీరు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. అసలు ఎలాంటి కష్టం పడాల్సిన అక్కెర లేదు. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. కొన్ని యాడ్స్ మీ మొబైల్ లాక్ స్క్రీన్ పై ప్రత్యేక్షమవుతాయి. యాడ్స్ ని బట్టి మీకు 1000 రూపాయల దాకా వస్తాయి. ఈ యాప్ స్పెషాలిటి ఏమిటంటే, మీరు యాడ్స్ చూడకపోయినా డబ్బులు మాత్రం వస్తాయి.