5 excellent tips for Oily Skin this summer

జిడ్డు చర్మం చాలామంది భారతీయులకి ఉంటుంది. ఏం చేస్తాం, మన జీన్స్, వాతావరణం, డైట్ అలాంటివి. ఇక ఈ సమ్మర్ లో చర్మం జిడ్డుగా మారడం ఇంకా కామన్. జిడ్డు చర్మం చాలా ఇబ్బంది పెడుతుంది. ముఖంలో కళ పోగొడుతుంది. మన చర్మం నిస్సారంగా కనబడేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మొటిమలకు కారణమై అందాన్ని చెడగొడుతుంది. మీది కూడా జిడ్డు చర్మమేనా ? మీరు కూడా ఈ ఇబ్బందులు పడుతున్నారా ? అయితే కంగారుపడోద్దు. మీకోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి మాదగ్గర.

* ముఖం జిడ్డుగా మారడానికి చాలా కారణాలు ఉంటాయి. జీన్స్ ఓ కారణమైతే మన అలవాట్లు పెద్ద కారణం. ముఖాన్ని సరిగా శుభ్రం చేసుకునే అలవాటు లేకపోవడం, ప్రోటీన్ ఉన్న ఆహరం తక్కువగా తినడం, నీళ్ళు తక్కువగా తాగడం, ఫ్యాట్స్, ఆయిల్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, మానసిక ఒత్తిడి .. ఇదిగోండి ఇలాంటి కారణాలు ఉనాయి. అందుకే వీటికి దూరంగా ఉండండి.

* ముఖాన్ని రోజుకి రెండు లేదా మూడు సార్లు శుభ్రపరుచుకోండి. నేచురల్ క్లీన్సేనర్ వాడండి. మైల్డ్ సబ్బులు మాత్రమే వాడండి. ఎండకి ఎక్కువగా చర్మాన్ని ఎక్స్పోజ్ చేయవద్దు. కుదిరితే డాక్టర్ సజెస్ట్ చేసే సన్ స్క్రీన్ లోషన్ వాడండి. నేచురల్ స్క్రబ్స్, అంటే అరటి తొక్క, అరేంజ్ తొక్క, నిమ్మకాయ తొక్క, కలబంద .. వీటిని క్లీనింగ్ కి వాడండి. ఎప్పుడు కాటన్ బాల్స్ తో ముఖాన్ని తుడుచుకోవడం అలవాటు చేసుకోండి. రోజ్ వాటర్, ఆలీవ్ ఆయిల్, ఆపిల్ సైడర్ వెనిగర్, తేనే, నిమ్మరసం వాడండి ముఖాన్ని కడుక్కునేటప్పుడు.