5 amazing health benefits of eating haleem

మరో వారం పది రోజుల్లో రంజాన్ సీజన్ ముగిసిపోతుంది. ఇంకోరకంగా చెప్పాలంటే భోజన ప్రియులు ఎంతగానో ఇష్టపడే హాలీం దొరకడం కష్టమైపోతుంది. హైదరాబాద్ లోనే రంజాన్ కాని సమయంలో హలీం తినాలంటే కిలోమీటర్ల కొద్ది వెళ్ళాలి. ఇక మిగితా ప్రదేశాల సంగతి సరేసరి. అందుకే ఈ వారం పదిరోజుల్లో మీకు ఇష్టమైనంత హలీం తినండి. కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. హలీంతో ఏం ఆరోగ్యమని ఆశ్చర్యపోకండి .. హలీంలో వాడేది చికెన్/మటన్, గోధుమలు, పప్పులు .. అన్ని మన శరీరానికి ఉపయోగపడేవి. ఓసారి మీరే చూడండి .. హలీం మనకు ఎన్ని సహాయాలు చేస్తుందో.

* ప్రోటీన్స్ మన శరీరానికి ఏంతో అవసరమని మనకు తెలుసు. ప్రోటీన్స్ కోసమే మాంసాహారం తినాలని చెబుతారు డాక్టర్లు. చికెన్ లో బ్రహ్మాండమైన మోతాదులో ప్రోటీన్స్ ఉంటాయి. మీరోజువారి ప్రోటీన్ అవసరలాను హలీం సులువుగా తీర్చేస్తుంది.

* హలీంలో అల్లం, వెల్లుల్లి, పసుపు కూడా వాడతారు కొందరు. అలాంటి హలీం ఎంతో ఉపయోగకరమైనది. ఇలాంటి హలీంలో పొటాషియం బాగా దొరుకుతుంది. పొటాషియం మన రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది. మజిల్ రిలాక్సేషన్ కూడా చేసే పొటాషియం, ప్రశాంతమైన నిద్రను కూడా అందిస్తుంది.

* గోధుమలు కూడా ఉండే హలీంలో డైటరి ఫైబర్ దండిగా దొరుకుతుంది. ఇది జీనవ్యవస్థకు మంచిది. అలాగే అవసరమైన కాలరీలు, బలాన్ని అందిస్తూ, కొవ్వు పెరగకుండా సహాయపడుతుంది హలీం. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం.

* హలీం సెక్స్ స్టామినాని కూడా పెంచుతుందని చెబుతారు. పూర్వం ఇస్లాం రాజులు శృంగారానికి ముందు హలీం తినేవారు అంట. హలీం లో డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుతారు కాబట్టి ఇది శృంగారజీవితానికి సహాయం చేస్తుందనే చెప్పొచ్చు.

* బాడి బిల్డింగ్ చేయాలనుకునేవారు కూడా హలీం బాగా తినొచ్చు. కండలు పెంచాలి అంటే కొవ్వు ఎక్కువ లేకుండా ప్రోటీన్ ఇచ్చే ఆహారం కావాలి. హలీం సరిగ్గా అలాంటి ఆహారమే. ఇది మజిల్ గ్రోత్ కి బాగా పనికివస్తుంది.