బరితెగించిన నలుగురు యువకులు..వివాహితపై     2018-06-20   01:57:50  IST  Raghu V

ప్రభుత్వాలు ,పోలీసులు మహిళల రక్షణకై ఎన్ని చర్యలు చేపడుతున్నా సరే మృగాళ్ళకి మానవత్వం..మంచితనం లేనప్పుడు పశువులాగానే ప్రవర్తిస్తూ ఉంటాడు..ఒంటరిగా ఉన్న మహిళళ పట్ల అత్యనత పాశవికంగా ప్రవర్తించడం వంటి దారుణాలకి ఒడిగాడుతారు..తప్పు ఎవరిదీ సమాజానిదా..? లేక విచ్చలవిడి శృంగారం ఒలకపోస్తున్న మధ్యమాలదా..లేక తల్లి తండ్రులదా అంటూ సంఘటన జరిగిన ప్రతీ సారి బేరీజు వేసుకోవడం సరిపోతోంది.ఎన్నో అఘాయిత్యాలు జరిగిపోతూ ఉంటాయి..వివరాలలోకి వెళ్తే..

తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఓ నలుగురు కామాంధులు ఒంటరిగా ఉన్న వివాహితపై అత్యంత పాశవికంగా ప్రవర్తించారు..ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు..ఈ సంఘటన కల్వకుర్తి లో కలలలం సృష్టించింది..మహిళలు ఒంటరిగా వెళ్ళాలంటేనే భయపడిపోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి..అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.