మహేష్ కోసం నలుగురు భామల రికమండేషన్     2017-10-10   05:05:38  IST  Raghu V

4 beauties using recommendation for Mahesh Babu

వరుస ఫ్లాపులు పడ్డా, రికార్డు స్థాయి డిజార్డర్స్ పడ్డా, మహేష్ బాబు బ్రాండ్ వాల్యూలో మాత్రం పెద్ద తేడాలేమి కనబడటం లేదు. భరత్ అనే బిజినెస్ లెక్కలు మళ్ళీ రికార్డు స్థాయిలోనే ఉండబోతున్నాయి. మహేష్ బాబు పారితోషికం కూడా మళ్ళీ రికార్డు స్థాయిలోనే ఉండబోతోంది. ఇక డైరెక్టర్స్ ఎప్పటిలాగే డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రిన్స్ తో జోడి కట్టాలని హీరోయిన్లు రికమండేషన్ మోసుకొస్తూనే ఉన్నారు.

మహేష్ బాబు 25వ సినిమా అంచనాలకు భిన్నంగా వంశీ పైడిపల్లి చేతిలో పడింది. 25వ సినిమా అంటే రాజమౌళి తోనో, శంకర్ తోనో లేక త్రివిక్రమ్ తోనో ఉంటుంది అనుకున్నారు అంతా. కాని ఊపిరి లాంటి క్లాసిక్ తనకూ ఇస్తాడనే నమ్మకం కావచ్చు, వంశీ పైడిపల్లి దగ్గరికి వెళ్ళింది సినిమా‌. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది తేలడం లేదు‌. హీరోయిన్ ఛాన్స్ కోసం ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు భామలు రికమండేషన్ ఉపయోగిస్తున్నారు. ఆ నలుగురు ఎవరో, ఎవరి రికమండేషన్ వాడుతున్నారో చూడండి.