ఒకడే నిర్మాత, 35 హీరోయిన్ల లైంగిక వేధింపుల ఆరోపణ     2017-10-16   05:16:57  IST  Raghu V

35 heroines accused this producer for $exual abuses

మీరు హాలివుడ్ సినిమాల వార్తలు రెగ్యులర్ గా చదివే వారు అయితే హార్వే వెయిన్ స్టెయిన్ ఎవరు అనేది కొత్తగా చెప్పనక్కరలేదు. ఎందుకంటే ఓ వారం పది రోజుల నుంచి ఏ హాలివుడ్ వెబ్ సైట్ చూసిన ఈ మహానుభావుడి పేరే వినబడుతోంది. ఇతను ఎవరు? ఇదేగా మీ సందేహం. సినిమా హీరో కాదులెండి. నిర్మాతగా ఓ డజను సినిమాలు నిర్మించాడు. ఇక ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గానైతే 70 సినిమాలకు పైగానే పనిచేసాడు. నిర్మాత అయినా రోజూ సెట్స్ కి వెళ్ళడు కాని ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ అయితే ప్రతిరోజూ సెట్స్ మీద ఉండాల్సిందే కదా.