34 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన లారీ.. ఇప్పుడు బయటపడింది..! ఎలాగో తెలుసా.?     2018-06-23   21:16:29  IST  Raghu V

34 ఏళ్ల కిందట గల్లంతైన లారీ ఇటీవల ఇసుక తవ్వకాల్లో బయటపడింది. ఆ లారీతో పాటు మూడు మృతదేహాల అవశేషాలు కూడా బయటపడ్డాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

కరీంనగర్ జిల్లాలో 1984న భారీ వర్షాలకు వరదలు వచ్చాయి. జూలై 23న దుర్శేడు గ్రామంలో ఉన్న ఇరుకుల్ల వాగు పాత వంతెనపై నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ సమయంలోనే శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన ఓ లారీ ఇరుకుల్ల వంతెన దాటుతుండగా నీటి ఉద్ధృతికి వాగులో కొట్టుకుపోయింది. లారీలో ఉన్న నలుగురు గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం అప్పుడే నాలుగు కిలో మీటర్ల దూరంలో దొరికింది. ఆ తర్వాత లారీ కోసం గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది.