జనసేన అభ్యర్థుల లిస్ట్ రెడీ అయ్యిందా ..?     2018-06-26   00:14:01  IST  Bhanu C

ఎన్నికల హడావుడి లో అన్ని పార్టీలు మునిగి తేలుతున్నా .. జనసేన మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉంది అంటూ పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలను ఆ పార్టీ లైట్ తీసుకుంటోంది. మిగతా పార్టీలు ఎంత హడావుడి చేసి ప్రజల్లో మద్దతు కూడగట్టుకుని ప్రయత్నం చేస్తున్నా జనసేన పార్టీ మాత్రం సైలెంట్ గానే చాప కింద నీరులా తమ కార్యకలాపాలు చక్కబెడుతోంది. ఎవరికీ ఎటువంటి అనుమానం కలగకుండా అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలను గుర్తించే పనిలో పడింది.

పార్టీలో చేరే యువత కోసం ఇంతకు ముందు ఏ పార్టీ చేయని విధంగా పరీక్షలు నిర్వహించి టాలెంట్ ఉన్న యువత రాజకీయాల్లోకి రప్పించాలని జనసేన అధ్యక్షుడు ఒక అవగాహనకు వచ్చాడు. ఇక ఇటీవల కొన్ని జిల్లాల్లో జరిపిన ప్రచారాల్లో అక్కడి స్థానిక జనసేన నాయకులతో చర్చలు జరిపారు. కాకపోతే ఇప్పటివరకు ఏపిలోని అన్ని నియోజక వర్గాలలో నాయకులను ఎంచుకోకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనెస్ గా మారింది. జనసేన మీద విమర్శలు చేసే వారికి ఇది ప్రధాన అంశంగా కూడా మారింది.