2019 కాంగ్రెస్ తోనే టీడీపీ పొత్తు..సాక్ష్యం ఇదే.     2018-05-24   01:31:19  IST  Bhanu C

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు..ఈరోజు మిత్రులు రేపటి శత్రువులు..ఈరోజు శత్రువులే రేపటి మిత్రులుగా అవుతారు ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాలకి కచ్చితంగా సూట్ అవుతుంది..రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజన చేశారని కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగిన ఏపీ పజలు తరువాతి ఎన్నికల్లో పార్టీని భూస్తాపితం చేశారు..ఏపీలో కాంగ్రెస్ మూలాలు కూడా లేకుండా సమూలంగా పీకి పడేసారు ఏపీ ప్రజలు…అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ , బిజెపి కలిసి పోటీ చేసి జనసేన మద్దతుతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే..అయితే


ఇదే సమయంలో ఇరు పార్టీలు నాలుగేళ్ళు మిత్రభందాన్ని కొనసాగించి చివరి నిమిషం లో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ దూరం అయ్యారు ఏకంగా బిజెపి పై కేంద్రం లో తీవ్రస్థాయి లో నిరసన తెలిపారు…చెప్పాలంటే మోడీ పరువు ప్రపంచవ్యాప్తంగా పోయిందన్నా..కర్ణాటకాలో తెలుగువారి ఓట్లు బిజేపి కి పడక అధిక సీట్లని గెలవలేదన్నా అదంతా చంద్రబాబు వలెనేనని చెప్పక తప్పదు..అయితే ఇదే సమయంలో ఎంతో మిత్రులుగా ఉన్న మోడీ చంద్రబాబు శత్రువులుగా మారిపోయారు..అయితే కర్ణాటకా ఫీటం బిజేపి నుంచీ కాంగ్రెస్ ,జేడీయు చేతికి వెళ్ళిన తరువాత అసలు రాజకీయం మొదలయ్యింది.