ఈ 6 రాసులలో మీ రాశి ఉందా అయితే 2018 లో మీ స్టార్ తిరిగినట్టే...! Devotional Bhakthi Songs Programs     2017-12-25   23:26:57  IST  Raghu V

2018 lo EE 6 rasula vallaki star Tiriginatte

మనిషి జీవితం మీద నవ గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. మానవులు గత జన్మలో చేసిన పాపాల ఆధారంగా తిరిగి జన్మిస్తూ ఉంటారు. మనుషుల అందరి స్థితి ఒకేలా ఉండదు. మనిషి జన్మించిన సమయం ఆధారంగా ఆ సమయంలో ఉన్న గ్రహ స్థితిని బట్టి ఆ మనిషి యొక్క జాతకాన్ని నిర్ణయిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో మేషం,వృషభం,మిథునం,కర్కాటకం,సింహం,కన్య,తుల,వృశ్చికం, ధనుస్సు,మకరం, కుంభం,మీనం అనే 12 రాశులు ఉంటాయి. మనిషి ఈ రాశుల్లో ఎదో ఒక రాశిలో జన్మిస్తాడు.

ఈ 12 రాశులు 12 లక్షణాలను కలిగి ఉంటారు. పుట్టిన రాశిని బట్టి వారికీ ఆయా లక్షణాలు ఉంటాయి. ఈ 12 రాశుల మీద గ్రహాలు వాటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. వచ్చే సంవత్సరంలో ఈ రాశులవారు ఎలాంటి ప్రభావాన్ని చూడబోతున్నారో తెలుసుకుందాం.

మేష రాశి
ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికంగా మంచి స్థాయిలో ఉంటారు. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగం చేసే వారికి అనుకున్న విధంగా ప్రమోషన్ వస్తుంది. పెట్టుబడులు బాగా కలిసి వచ్చి ధన లాభం కలుగుతుంది. అలాగే వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది.

కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం బాగా కలిసి రావటమే కాకుండా ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు. మీరు నాయకుడుగా ఉండి అందరి చేత శెభాష్ అనిపించుకుంటారు. అయితే పని ఒత్తిడి కారణంగా కొంచెం జీవిత భాగస్వామికి దూరంగా ఉంటారు. అది అర్ధం చేసుకొని ముందుకు సాగితే అన్ని ఆనందాలే.