2018 ఫిలిం ఫేర్ అవార్డ్ లకి బరిలో ఉన్న నటులు , సినిమాలు , దర్శకులు , ఎవరో చూడండి..     2018-06-07   03:44:15  IST  Raghu V

2017వ సంవత్సరం మన తెలుగు పరిశ్రమ కి బాగా కలిసి వచ్చిన సంవత్సరం సంక్రాంతి నుండి ఏడాది చివరి వరకు వచ్చిన చాలా సినిమాలు కలెక్షన్స్ తో దూసుకుపోయాయి..మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల గ్యాప్ తరువాత కమ్ బ్యాక్ సినిమా గా తీసిన ఖైదీ నం.150 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అలాగే బాలకృష్ణ గారి 100 చిత్రం గౌతమీ పుత్ర శతకర్ని కూడా 50 కోట్ల కలెక్షన్స్ చేసింది. 2017 లో పెద్ద హీరోలకే కాదు చిన్న హీరోలకి మరియు కొత్త దర్శకులకు విజయాలు వచ్చాయి.అర్జున్ రెడ్డి తో సందీప్ వంగ, ఘజి తో సంకల్ప్ రెడ్డి మంచి పేరును తెచ్చుకున్నారు..

సినిమాకి కలెక్షన్ లు వస్తేనే కాదు అవార్డ్ లు వచ్చినప్పుడే సినిమా బృందానికి ఆనందం ఉంటుంది.జూన్ 16న 65వ ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకు జరగబోతున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఫిలిఫేర్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ సంవత్సరం బరిలో చాలా మంది హీరోలు దర్శకులు ఇతర నటులు ఉన్నారు , వారెవరో చూడండి…

ఉత్తమ కథానాయకుడి కేటగిరి లో :


1) చిరంజీవి ( ఖైదీనెంబర్ 150)
2) బాలకృష్ణ ( గౌతమీపుత్ర శాతకర్ణి )
3) ప్రభాస్ ( బాహుబలి 2)
4) ఎన్టీఆర్ ( జై లవకుశ )
5) విజయ్ దేవరకొండ ( అర్జున్ రెడ్డి )

ఉత్తమ చిత్రం కేటగిరీ లో :


1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) ఫిదా
3) శతమానం భవతి
4) అర్జున్ రెడ్డి
5) బాహుబలి 2