2014లో బాబుకు 103... 2019లో సీట్ల లెక్క ఇదే..!     2018-05-18   06:29:47  IST  Bhanu C

అవును! ఏపీలో మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌ధానంగా అసెంబ్లీ ఎన్నిక‌లు ఇక్క‌డ అత్యంత ప్ర‌తిష్టాత్మ కం కానున్నాయి. గ‌త 2014 ఎన్నిక‌ల‌కు 2019లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు మధ్య చాలా వ్య‌త్యాసం కూడా క‌నిపించ‌నుంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌ధానంగా రెండే విష‌యాలు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేశాయి. వాటి ఒక‌టి.. విభ‌జ‌న అంశం. రెండు ప‌వ‌న్ మ‌ద్ద‌తివ్వ‌డం అనే అంశం. ఈ రెండు విష‌యాల ఆధారంగానే ప్ర‌జ‌లు ఓటింగ్ చేశారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో పార్టీల పంథాలు మారిపోయాయి. అదేవిధంగా ప్ర‌జ‌ల మ‌దిలో ఆశ‌లు, ఆశ‌యాలు కూడా మారిపోయా యి. దీంతో 2019 ఎన్నిక‌లు అంత ఆషామాషీగా జ‌రిగిపోతాయ‌ని భావించ‌డం లేద‌నేది విశ్లేష‌కుల అంచ‌నా!

వ‌చ్చే ఏడాది మే 16 నాటికి రిజ‌ల్ట్స్ వెలువ‌డే అవ‌కాశం ఉంది. అంటే… ఖ‌చ్చితంగా ఏడాదిలో రాష్ట్ర పార్టీల భ‌విత‌వ్యం మారిపోతుంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుత అధికార పార్టీకి ఎన్నిసీట్లు ద‌క్క‌నున్నాయ‌నే విష‌యంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది. గ‌త 2014 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 103 స్థానాల్లో టీడీపీ విజ‌యం సాధించింది. మిగిలిన వాటిలో బీజేపీ 4 చోట్లా, వైసీపీ 68 స్థానాల్లోనూ విజ‌యం సాధించింది. అయితే, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న టీడీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలిచే స‌త్తా ఉందా? అనేది ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన అంశం.