18 Puranas and their themes

1) బ్రహ్మ పురాణం :

దీనికి ఆది పురాణం అనే పేరు ఉంది. పేరుకే బ్రహ్మ పురాణం కాని, బ్రహ్మని పరమాత్మగా చూపదు. మహావిష్ణువు దశల గురించి, శివుడి గురించి ఎక్కువ చర్చ ఉంటుంది.

2) పద్మ పురాణం :

విష్ణువు నుంచి చూస్తే ఈ బ్రహ్మాండం ఏమిటి ? విష్ణు అవతారాల గురించి ఉంటుంది. ఇందులోనూ రాముడు – సీత కథ ఉన్నా, రామాయణంకి భిన్నంగా ఉంటుంది.

3) విష్ణు పురాణం :

మహావిష్ణువు గురించి, పరమాత్మ మహావిష్ణువుగా వివరంగా ఉంటుంది. అయితే కాలక్రమంలో దీని చాలా మారుస్తూ వచ్చారని చెబుతారు.

4) శివ పురాణం :

శైవం గురించి చెబుతుంది. శివుడి నుంచే విష్ణువు, బ్రహ్మ వచ్చినట్లు చెబుతుంది.

5) భాగవత పురాణం :

అత్యధిక ప్రజాదారణ పొందిన పురాణం, అత్యధిక మందికి తెలిసిన పురాణం. విష్ణువు అవతారాల గురించి చెబుతుంది.

6) నారద పురాణం :

భారతదేశంలో ఉన్న పవిత్ర నదుల గురించి చెబుతుంది. గ్రహాల గురించి చెబుతుంది. విష్ణువు, శివుడు, కృష్ణుడు, లక్ష్మిదేవి గురించి విపులంగా ఉంటుంది.

7) మార్కండేయ పురాణం :

వైష్ణవం, శైవంకి భిన్నంగా, శక్తి గురించి చెప్పే పురాణం ఇది. అంటే నారాయణుడు కాదు, శివ పురాణంలో చెప్పినట్టు శివుడు కాదు, ఆదిశక్తి, అంటే ఓ మహిళని సృష్టికర్తగా చూపుతుంది.

8) అగ్ని పురాణం :

రాజకీయాలు, వాస్తు శాస్త్రం, సైన్యం, సైన్స్ .. ఇలా ఇప్పుటి ప్రపంచంలో ఉన్న ఎన్నో విషయాల గురించి అప్పుడే చెప్పారు.

9) బ్రహ్మాండ పురాణం :

న్యాయం, ప్రభుత్వాలు, రాజకీయాలు ఇలాంటి అంశాలు ఎన్నో ఉంటాయి. లలీత సహస్ర నామాలు ఇందులో ఉండటం విశేషం.