14 ఏళ్ల బాలుడితో అక్రమ సంబంధం...చూశాడని కొడుకుని చంపిన తల్లి.! అసలేమైంది.?     2018-05-30   02:19:13  IST  Raghu V

అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న జీవిత భాగ‌స్వామిని మోసం చేస్తూ ఇత‌రుల‌తో అక్ర‌మ సంబంధాలు పెట్టుకునేందుకు నేటి త‌రుణంలో కొంద‌రు దేనికీ వెనుకాడ‌డం లేదు. అవ‌స‌రం అనుకుంటే ఆ జీవిత భాగస్వామిని కూడా త‌మ అక్ర‌మ సంబంధం కోసం అంత‌మొందిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతూనే ఉన్నాయి. కానీ 14 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం అడ్డొచ్చిన కొడుకునే చంపేసింది ఆ మహిళ. తల్లి అనే పదానికే మచ్చ పడేలా చేసింది ఆ నీచురాలు. అసలేమైందో వివరాలు చూడండి.

పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాస్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మొండల్ పారా ప్రాంతానికి చెందిన రాజాపూర్ గ్రామ నివాసి గోస్తో మొండల్ భార్య సాగరి (28). ఈ దంపతులకు ఏడేళ్ల చిన్నారి సాధన్ ఉన్నాడు. వీరి పొరుగింటికి చెందిన సచ్చింద్రనాథ్ సర్దార్ తన భార్యతో కలిసి కోల్‌కతాలో నివాసం ఉంటున్నారు. కానీ, అతడి కుమారులు రిషి (14), ఆనంద్ (12) సొంతూరులోనే ఉంటూ విద్యాభ్యాసం సాగిస్తున్నారు.

28 ఏళ్ల ఆ మహిళ తన ఇంటి పక్కనే ఉన్న 14 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా చూసిన పాపానికి ఆమె తన ఏడేళ్ల కొడుకును అతి దారుణంగా గొంతు నులిమి హత్య చేసింది.

రిషితో సాగరి చనువు పెంచుకుంది. తన భర్త గోస్తో బయటకి వెళ్లినప్పుడల్లా ఆ బాలుణ్ని ఇంటికి రప్పించుకొని శారీరక వాంఛ తీర్చుకుంటోంది. గత గురువారం (మే 24) సాధన్ ఆరుబయట ఆడుకుంటుండగా.. గోస్తో ఇంట్లో లేని సమయం చూసి రిషి.. సాగరి వద్దకు వచ్చాడు. వారిద్దరూ ఏకాంతంగా గడుపుతుండగా.. ఆరుబయట ఆడుకుంటున్న సాధన్ అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చాడు.