బొప్పాయి తినటం వలన కలిగే సైడ్ ఎఫక్ట్స్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు  

బొప్పాయిలో ఎన్నో పోషకాలు మరియు తీపి రుచిని కలిగి ఉండుట వలన అందరు ఇష్టంగా తింటారు. బొప్పాయిలో కేలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బొప్పాయిలో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. బరువు తగ్గటానికి ప్రయత్నం చేస్తున్న వారికీ బొప్పాయి మంచి డైట్ అని చెప్పవచ్చు. బొప్పాయిని లిమిట్ గా తీసుకుంటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అదే అతిగా తీసుకుంటే మన శరీరం మీద చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది.

బొప్పాయిని ఎక్కువగా తినటం వలన కడుపు ఉబ్బరం ,గ్యాస్ సమస్యలు,కడుపు అప్ సెట్ ,అపానవాయువు, వికారం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

బొప్పాయిని ఎక్కువగా తినటం వలన బొప్పాయిలో ఉండే విటమిన్ సి కిడ్నీలో రాళ్ళూ ఏర్పడే అవకాశం ఉంది.

బొప్పాయిని ఎక్కువగా తినటం వలన బొప్పాయిలో ఉండే బీటా కెరోటిన్ చర్మ రంగులో అసహజమైన మార్పు వస్తుంది. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో కెరోటినిమా అని అంటారు. ఈ పరిస్థితిలో కళ్ళు పాలిపోవటమే కాకుండా అరచేతులు పసుపుగా మారతాయి. అప్పుడు కామెర్లు రావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి

బొప్పాయిని ఎక్కువగా తీసుకోవటం వలన దానిలో ఉండే లాక్టేషన్ వలన గర్భిణీ స్త్రీలలో అబార్షన్ కి కారణం అవుతుంది.