12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది

పేరు క్యాట్లిన్ నికోల్ డేవిస్. వయసు 12. ఆ వయసులో పిల్లలకి ఆటపాటలు తప్ప మరో ప్రపంచం తెలియదు. స్కూలు ఎగోట్టడం తప్ప మరో తప్పు చేయరు. కల్మషం లేని మనసు, కల్పితం లేని మాటలు .. అల్లరి చేష్టలు. ఇలాంటి వయసులో అల్లారుముద్దుగా పెరగాల్సిన పిల్ల ప్రాణం తీసుకుంది. అది కూడా తండ్రి వలన (సొంత తండ్రి కాదు, తల్లి రెండోవ భర్త).

విషయంలోకి వెళితే నికోల్ తన ఫేస్ బుక్ ఖాతాలో లైవ్ విడియో మొదలుపెట్టింది. అందరిలాగా ఆటలాడుతున్నప్పుడు పెట్టిన విడియో కాదు అది. సూసైడ్ చేసుకుంటూ లైవ్ విడియో పెట్టింది. చెట్టుకి ఊరి వేసుకుంటూ, తన చావుని తానే చిత్రీకరించుకుంది. మరి ఆ పసి హృదయం ఎందుకు ఆగింది ? తన గుండె చప్పుడిని తానే ఎందుకు ఆపేసుకుంది?