10 Ways to Stop Frequent Urination

రోజుకి నాలుగు నుంచి ఎనిమిది సార్లు ఒక మనిషి మూత్ర విసర్జన చేయాలి. అపుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మన ఒంట్లో ఉండే మలీన పదార్థాలు, టాక్సిన్స్ మూత్రం ద్వారానే బయటకి వస్తాయి. అందుకే నీళ్ళు బాగా తాగమని అంటారు. నీళ్ళు బాగా తాగితే మూత్రం బాగా వస్తుంది. అప్పుడే శరీరం లోపలి నుంచి పరిశుభ్రంగా ఉంటుంది. అలాగని మూత్రం మాటిమాటికి రాకూడదు. అలాంటి సమస్య మీకు ఉంటే దాన్నే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని అంటారు. అంటే మన మూత్రాన్ని స్టోర్ చేసే బ్లాడర్ అవసరానికి మించి పనిచేస్తోందన్న మాట. ఈ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఓ చోట సరిగా కూర్చోలేం, ఏ పని సరిగా చేయలేం, నలుగురిలో ఆ ఇబ్బంది మాటలకు అందదు. అయితే కంగారోద్దు. ఈ సమస్యకు చికిత్స ఉంది. ఇప్పుడైతే బయటపడేందుకు ఓ 10 మార్గాలను చూడండి .

* కేఫైన్ డ్రింక్స్ ఎక్కువగా తాగొద్దు. ద్రవ పదార్థాలు ఎంత తీసుకుంటున్నాం అనేది బాగా గమనించండి. మగవారైతే రోజుకి మూడున్నర లీటర్ల ద్రవపదార్థం తీసుకోవాలి. అదే ఆడవారైతే రెండున్నర లీటర్లు చాలు. ఏ లెక్క ఎక్కడైనా తప్పుతున్నారో చూడండి.

* పాలకూరని బాగా ఉడకబెట్టి తింటూ ఉండండి. ఇది పనిచేస్తుంది.

* కేగెల్ వ్యాయామాలు ఉంటాయి. అవి ఎలా చేయాలో మంచి ట్రైనర్ ని సంప్రదించి తెలుసుకోండి. ఈ వ్యాయామాలు బ్లాడర్ పనితనాన్ని బ్యాలెన్స్ చేస్తాయి.

* దానిమ్మ తొక్కను బాగా దంచండి. దాన్ని ఓ పేస్టులా చ్సుసుకొని నీళ్ళు కలుపుకొని రోజుకి ఓసారి తీసుకోండి. ఇది బాగా పని చేసే చిట్కా.