నార్మల్ డెలివరీ తరువాత తల్లి కోలుకోవడానికి 10 జాగ్రత్తలు

తల్లికి ఏం కష్టాలుంటాయి అంటే ఎవరైనా సరే, నవమాసాలు ఆమె మోసే బరువు గురించి మాట్లాడుతారు, ఆ తొమ్మిది నెలల జాగ్రత్తల గురించి, డెలివరీ సమయంలో ఆమె పడె అవస్థ, నొప్పుల గురించి మాట్లాడుతారు. అంతేనా, తల్లి శారీరకంగా, మానసికంగా ఒత్తిడి అక్కడితోనే అయిపోతుందా ? ఆ తరువాత ఆమెకి అలసట, నొప్పి ఉండదా? డెలివరీ తరువాత ఆమె అవస్థల గురించి ఎవరు మాట్లాడరే? వెజైనల్ బర్త్ (నార్మల్) డెలివరీ అయనా, ఆమె శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ వేరే దిశలో ఉంటాయి. శారీరకంగా నొప్పులు ఉంటాయి. కేవలం సిజేరియన్ అయినప్పుడే, ఆ గాయాలుంటేనే ఆమె మానసికంగా, శారీరకంగా బాధలో ఉన్నట్లు అర్థం కాదు. కాబట్టి నార్మల్ డెలివరీ అయినసరే, తల్లి ఈ పది విషయాలు పట్టించుకోవాలి.

1) విశ్రాంతి

విశ్రాంతి, నిద్ర .. రెండూ బాగా తీసుకోవాలి. తొమ్మిది నెలలుగా ఆమె నొప్పులతో, శరీరంలో జరుగుతున్న మార్పులతో ఎన్నో నిద్రలేని రాత్రులని గడిపింది. శారీరకంగా, మానసికంగా అలసిపోయిన తల్లికి అన్నిటికన్నా ముందుగా మంచి నిద్ర, విశ్రాంతి అవసరం. లేదంటే ఆమె మీద ఒత్తిడి ఇంకా పెరిగిపోతుంది. పుట్టిన బిడ్డను చూసుకోవాలి కాబట్టి ఆ తాలూకు స్ట్రెస్ మొదలవుతుంది. ఈ సమయంలో హార్మోన్స్ సమతూల్యం దెబ్బతినకూడదు అంటే విశ్రాంతి అవసరం.