హైపర్ ఆదిని పిచ్చకొట్టుడు కొడతా అంటూ ఫేసుబుక్ లైవ్ లో శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు     2018-05-29   03:40:43  IST  Raghu V

శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్ వివాదం తెర మీదికి తీసుకొచ్చిన నటి.అంతకుముందు ఈమె అరవింద్ 2 ఇంకా కొన్ని సినిమాల్లో నటించింది..అవకాశాల కోసం సినీ ఇండస్ట్రీ కి వస్తే క్యాస్టింగ్ కౌచ్ భూతం వారిని వాడుకొని వదిలేస్తున్నారు అంటూ ఆరోపణలు చేసింది.తెలుగు పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వట్లేదని , తెలుగు అమ్మాయిలు కూడా నార్త్ అమ్మాయిల కన్నా పోటీగా నటించగలరు అంటూ ఉద్యమం ప్రారంభించి న్యూస్ చానెల్స్ లో హల్ చల్ చేసింది.ఆ మధ్య కొన్ని కారణాల వల్ల ఆమె చేస్తున్న ఉద్యమం ఆగిపోయింది.అయితే అప్పుడప్పుడు ఫేసుబుక్ లైవ్ లో , మరియు ఫేసుబుక్ స్టేటస్ లతో వార్తల్లో నిలుస్తోంది.తాజాగా 27 వ తేదీన ఫేసుబుక్ లైవ్ లో జబర్దస్త్ షో ని , హైపర్ ఆదిని విమర్శిస్తూ ఫేసుబుక్ లో లైవ్ ఇచ్చింది.

అందులో జబర్ధస్త్ హైపర్ ఆదిపై సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ‘హైపర్ ఆది.. మిమ్మిల్ని ఇంతక ముందు కలిశా.. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. చాలా గౌరవం ఉంది. మంచి రైటర్ మీరు. అవకాశాలు లేక ఇబ్బందులు పడే వారికి ‘జబర్దస్త్’ షో చాలా ఉపయోగకరంగం ఉంది.