హమ్మయ్య ! టీడీపీ గెలవదు ! బీజేపీ కుడా అంతేనట !     2018-06-11   01:19:36  IST  Bhanu C

మనం బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కవాడు మాత్రం బాగుపడకూడదు అనే భావన చాలామందిలో కనిపిస్తుంటుంది. అలాగే… రాజకీయాల్లో కూడా మన పార్టీ సంగతి ఎలా ఉన్నా పక్క పార్టీ పాడవుతుందా లేదా అని చూస్తూ ఉంటారు. ఇది సహజం. కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ – ఏపీ అధికార పార్టీ టీడీపీ ఈ విధంగానే వ్యవహరిస్తున్నాయి.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని చంద్రబాబు అవకాశం దొరికినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు. అదేవిధంగా బీజేపీ కుడా చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ గెలిచే పరిస్థితి లేదని చెప్పుకుంటున్నారు.

బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవలేడు అని, ఇది తథ్యమని ఆ పార్టీ నేతలు ఆ సమావేశంలో చర్చిన్చుకున్నారట. గత ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతుగా నిలిచిన ప్రధాన సామాజికవర్గాలు ఇప్పుడు దూరం అయ్యాయని.. కాబట్టి టీడీపీ మళ్ళీ అధికారం చేపట్టే ఛాన్స్ లేదని బీజేపీ భావిస్తోంది.