స్పైడర్ పాటలో “సిసిలియా” మాటకి అర్థం తెలుసా ?     2017-09-16   04:22:02  IST  Raghu V

మహేష్ సినిమా టీజర్ చూసిన వాళ్ళలో అందరూ చేసే కామెంట్స్ ఒక్కటే..మహేష్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉన్నాడు అని. ఆ సినిమా లో మహేష్ హీరోయిన్ కోసం చేయని వేషాలు,అల్లర్లు చాలా కొత్తగా ఉంటాయట.అయితే టీజర్ లో వచ్చే సాంగ్ లో సిసిలియా..సిసిలియా అనే మాటకి అర్థం ఏమిటో అని అభిమానులు,పాటలని ఇష్టపడే వాళ్ళకి పెద్ద ప్రశ్న అయ్యిందట.ఎవరికీ అంతుచిక్కని ఈ మాట గురించి ఈ పాట రాసిన రామజోగయ్య శాస్త్రి క్లారిటీ ఇచ్చారట.

అస‌లు సిసిలియా అంటే ఏంటో తెలుసా? ‘అంద‌మైన అమ్మాయి’ అని త‌న‌తో రామ‌జోగ‌య్య శాస్త్రి చెప్పాడ‌ని యాంక‌ర్ సుమ చెప్పింది. హైద‌రాబాద్‌లోని శిల్ప‌కళా వేదిక‌లో మహేశ్ బాబు స్పైడ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగుతోంది. ఈ ఈవెంట్ లో సినీ గేయ ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడిన త‌రువాత సుమ ఈ విష‌యం చెప్పింది.ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు అందరూ రామజోగ‌య్య శాస్త్రిని ఆకాశానికి ఎత్తేసారట. ఎక్కడైనా టీజర్ లో సన్నివేశాలు చూసి క్యూరియాసిటీ పెంచుకుంటారు ప్రేక్షకులు .కానీ శాస్త్రి గారి పాటల్లో మాటలకోసం అభిమానులు క్యూరియాసిటీ పెంచుకోవడం ఆశ్చర్యంగా ఉంది అని అంటున్నారట సినిమా యూనిట్.

ఈ ఫంక్షన్ కి విచ్చేసిన పాటల రచయిత రామజోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ. ఈ సినిమా అద్భుత విజ‌యం సాధించ‌డం ఖాయమ‌ని, ఈ సినిమా కి పాటలు రాసే అవ‌కాశం క‌ల్పించినందుకు మ‌హేశ్ బాబు, మురుగ దాస్‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటున్నాన‌ని తెలిపారు. స్పైడర్ సినిమా అభిమానుల ఊహలకి అందని విధంగా ఉంటుంది అన్నారు.