స్నేహితుడి భార్య అనికూడా లేకుండా బరి తెగించాడు..     2018-05-23   02:00:04  IST  Raghu V

మనిషికి ఉన్న అన్ని బంధాలలో కంటే స్నేహానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది..భార్యకి ,తల్లి తండ్రులకి చెప్పుకోలేని ఎన్నో విషయాలు ఒక్క స్నేహితుడికే చెప్పుకుంటారు..అలాంటి స్నేహాన్ని సైతం కొంత మంది బ్రష్టు పట్టిస్తున్నారు..స్నేహం యొక్క విలువని మర్చి పోయి ఆ భందానికి మాయని మచ్చ తీసుకు వస్తున్నారు.. వివరాలలోకి వెళ్తే…

చెన్నై రాష్ట్రంలోని చెన్నైలో గల టీ నగర్ సౌత్‌బోగ్ రోడ్డు అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తి వాచ్‌మెన్ గా ఎప్పటి నుంచో చేస్తున్నాడు..అతడికి భార్య, పిల్లలున్నారు.అయితే అతడు ఉదయం సమయంలో అపార్ట్‌మెంట్ లో పనిచేస్తాడు. రాత్రిపూట అపార్ట్ మెంట్‌కు దగ్గరలోని ఒక సంస్థలో వాచ్‌మెన్ గా చేస్తున్నాడు అయితే ఈ క్రమంలోనే అతడు తన స్నేహితుడికి ఉద్యోగం లేదని తెలుసుకుని మరీ తన స్నేహితుడు అయిన వినోద్ ను తాను వాచ్‌మెన్ గా ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు పక్కనే ఉన్న భవనంలో వాచ్‌మెన్ గా నియమించాడు.