స్టేజిపై బూతులు, నేతకి చురుకులు ‌.. యువహీరో వీరంగం

సైడ్ హీరోగా పరిచయమై, ఆ తరువాత పెళ్ళిచూపులు తో హీరోగా మారిన విజయ్ దేవరకొండ, అప్పుడే తనకంటూ ఓ మార్కేట్ ఏర్పాటు చేసుకున్నాడు. అర్జున్ రెడ్టి సినిమాను ఆరు కోట్ల దాకా చెల్లించి సొంతం చేసుకున్నారు బయ్యర్లు. విడుదల చేసిన టీజర్ మరియు ట్రైలర్ .. రెండింటికి విపరీతమైన స్పందన లభించింది. ఇక హీరోహీరోయిన్లు ముద్దుపెట్టుకుంటున్న పోస్టర్ ఒకటి ఎక్కడపడితే అక్కడ కనబడుతోంది. మొత్తానికి కొంచెం సంచలనాత్మక రీతిలో అయినా, సినిమాకి కావాల్సినంత పబ్లిసిటి అయితే దొరుకుతోంది.

అర్జున్ రెడ్టి విపరీతమైన కోపం ఉన్న మెడికల్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు విజయ్. మరి నిజజీవితంలో లో విజయ్ అచ్చం అలాగే ఉంటాడో లేడో చెప్పలేం కాని, ఆ ఛాయలు మాత్రం కనిపిస్తున్నాయి ఈమధ్య. అర్జున్ రెడ్డి కిస్సింగ్ పోస్టర్ హైదరాబాద్ లో ఎక్కడపడితే అక్కడ కనబడుతోంది. నగరమంతా కనిపిస్తున్న ఈ పోస్టర్ యువతను పెడదేవ పట్టించేలా ఉందని కాంగ్రెస్ నేత హనుమంతరావు వాదిస్తున్నారు. నిన్న ఓ బస్ మీద ఉన్న కిస్సింగ్ పోస్టర్ ని ఆయన తొలగించే ప్రయత్నం కూడా చేసారు. ఆ ఫోటోని తన ఫేస్ బుక్ పేజిలో పోస్ట్ చేసిన విజయ్, దానికి “తాతయ్య, చిల్” అనే చురుకైన కాప్షన్ పెట్టాడు.