స్కూల్ ఫీజు అని అబద్దం చెప్పి...తండ్రి డబ్బులతో సినిమాకెళ్ళాడు.! తర్వాత ఏమైందో తెలుస్తే కన్నీళ్లే.!     2018-05-30   02:11:23  IST  Raghu V

“నాన్నా! రేపు మా తరగతిలో పిల్లలంతా పరీక్ష ఫీజు చెల్లించాలని హెడ్ మాస్టర్ చెప్పారు” ఇంట్లోకి అడుగు పెడుతూనే అన్నాడు రఘు. అప్పుడే కూలిపని ముగించుకుని ఇంటికి వచ్చిన కేశవులు కొడుకు మాటలు విని ‘అలాగా! ఫీజు ఎంత ఏంటి? అని అడిగాడు. రెండు వందలని మెల్లగా చెప్పాడు రఘు.

“అవునా! రెండు వందలా ఈసారి బాగా పెంచేశారు , సర్లే రేపు బడికి వెళ్ళినపుడు ఇస్తాను” అంటూ పెరట్లోకి నడిచాడు కేశవులు. మరుసటి రోజు ఉదయం రఘు బడికి వెళ్లేందుకు తయారవుతుండగా ‘ఇదిగోరా రెండువందలు, జాగ్రత్త మరి , వెళ్లినవెంటనే టీచర్ కి ఇవ్వు’ అని జేబులో పెట్టాడు. సరే నాన్న అంటూ బయటకు నడిచాడు రఘు. రఘు కాస్త దూరం నడవగానే అతని స్నేహితుడు అమర్ ఎదురయ్యాడు. ఏరా మీ నాన్న ఫీజు డబ్బులు ఇచ్చారా ? ఆతృతగా అడిగాడు అమర్.

ఇచ్చారురా మరి , మీ నాన్న ? అమర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు రఘు.
నేను ఫీజు రెండువందల యాభై రూపాయలు అని చెప్తే మారు మాటాడకుండా ఇచ్చేసారరా మా నాన్న, గొప్పగా చెప్పాడు అమర్.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు చెల్లించవలసిన ఫీజు వంద రూపాయలే. తమ తల్లిదండ్రులనుంచి ఎక్కువ డబ్బు తీసుకుని వాటితో సినిమాకు వెళ్లాలని పథకం వేసుకున్నారు.ఇద్దరిది ఒకే తరగతి, ఒకే బెంచీలో కూర్చుంటారు, కలిసి తిరుగుతుంటారు. తల్లిదండ్రుల్ని నమ్మించి భలేగా డబ్బులు తీసుకున్నామని ఇద్దరూ మురిసిపోయారు. చెరో వంద వారి తరగతి ఉపాధ్యాయుడికి ఫీజు చెల్లించారు.