సెలవు రోజు ఓ భార్య తన భర్తతో మాట్లాడిన ఈ మాటలు చూస్తే     2018-05-21   00:12:54  IST  Raghu V

ఒక సెలవురోజు భార్య భర్తతో ” మనం కాసేపు మాట్లాడుకోవాలి! మీ ఫోను స్విచ్ ఆఫ్ చేయండి!!” అంది

“ఫోన్ ఉంటే ఏమౌతుంది?”

ఏమీ కాదు అందుకే మీరు ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి

“సరే చెప్పు !!ఏం మాట్లాడాలి ?”అన్నాడు భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ..

“మీరు మారిపోయారు!”

“మన పెండ్లి నిశ్చితార్థం నుండి పెండ్లి వరకు ఎలా ఉన్నారు?”
“అప్పుడు గంటగంటకు మెసేజ్ లు లేదా ఫోన్లు!”

లేచిన తర్వాత మొదటిమాట నీతోనే..

పడుకునే ముందు చివరిమాట నీతోనే… మొదటీ చివరీ మాటల మధ్య రోజంతా నీ ఆలోచనలతోనే అనేవారు.. అలాగే ఉండేవారు’

“పెండ్లైన సంవత్సరం వరకు ఎలా ఉన్నారు?”

“మీ కళ్ళలో..ప్రవర్తనలో ఎంతప్రేమ కనిపించేది ఇష్టంగా చూస్తున్న మీ కళ్ళలోకి చూస్తేనే మైకం కమ్మేది నాకు ఇప్పుడు కూడా అప్పటి మీ చూపులు గుర్తొచ్చినపుడు మనసంతా తన్మయత్వంగా అనిపిస్తుంది

“ఇప్పుడెలా వున్నారు?”

“మీ ప్రేమంతా ఎటుపోయింది?ఆ ఇష్టంగా చూసే చూపులేవి?
ఒక గోడనో.. వస్తువునో చూసినట్లుండే ఆ చూపులు నాకు నచ్చట్లేదు!!”
“మీరెందుకు మారి పోయారు?నాకు కారణం తెలియాలి!!
నా వల్లేమైనా తప్పుజరిగిందా?? చెప్పండి..అలా ఉంటే మార్చుకుంటాను” అంది భార్యా.

చా అదేం లేదు
అదంతా సహజంగా జరిగేదే!” అన్నాడు భర్త.

“అదే ఎలా జరుగుతుంది? నాకు జరగలేదే! పోనీ మీ గురించి చూసినా అప్పుడైనా ఫోన్ తో గడిపేవారు..ఇప్పుడు కూడా ఫోన్ తో గడుపుతున్నారు ఇంకా ఎక్కువగా!!”
“అంటే నేను ఫోన్ పాటి విలువచేయనా?” అడిగింది భార్య.

అబ్బా ప్లీజ్ అపార్థం చేసుకోకు అదంతా సహజంగా జరుగుతుందని నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు రెంట్ కు ఉన్న మా ఇంటి ఓనర్ అంకుల్ కూడా చెబుతుండేవాడు. అతనో ఎక్జాంపుల్ కూడా చెబుతుండేవాడు అది వింటే నువ్వు కూడా కరెక్టే అంటావు” అన్నాడు భర్త.

సరే ఆ ఎక్జాంపుల్ ఏమిటో చెప్పండి అడిగింది.