సుడిగాలి సుధీర్ , రష్మిల మధ్య ప్రేమ నిజమేనా? ఢీ షో లో రష్మీ తో ప్రేమ గురించి ఏం చెప్పడంటే...  

ఈ టీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సుడిగాలి సుధీర్, ఆ షో యాంకర్ రష్మి ఇద్దరు ఎవరికి వారు సొంత టాలెంట్ తో వచ్చినవారే.. ఇక మల్లెమాల ప్రొడక్షన్ వల్ల జబర్దస్త్ క్లిక్ అవడం అందులో ఉన్న ప్రతి ఒక్క టీం లీడర్ కి , అందులోని టీం మెంబెర్స్ కి ఈటీవీ ప్లస్ లో ఒక్కో షో చేయండి అని అప్పగించారు.

అయితే సుధీర్ , రష్మీ ల సన్నిహిత్యం చూసి వారిని ఈటీవీ లో ప్రసారామయ్యే ఢీ షో లో వీళ్ళకి టీం లీడర్స్ బాధ్యత ఇచ్చారు, యాంకర్ గా ప్రదీప్ వ్యవహరిస్తుంటే జడ్జిస్ గా శేఖర్ మాస్టర్ , ప్రియమణి జడ్జెస్ గా ఉన్నారు. రష్మీ అంటే సుధీర్ కి ఇష్టమని చాలా పుకార్లు ఉన్నాయి , కానీ ఇవి పుకార్లు కాదు నిజమే అనడానికి ఢీ షో లో వారి మధ్య కెమిస్ట్రీ చూస్తేనే అర్థమవుతుంది.చాలా సార్లు సుధీర్ ని దీని పై స్పందించమంటే మా మధ్య అలాంటిది ఏమి లేదు షో కోసమే అలా చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు..