సీన్ లోకి “సబ్బం హరి” జగన్ ,పవన్ లని దుమ్ము దులిపేశాడు    2018-03-22   06:06:28  IST 

సబ్బం హరి ఈ పేరు రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికీ అయినా సరే సుపరిచితమే..ఎందుకంటే వైఎస్ బ్రతికున్నప్పుడు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన నేత.వైఎస్ కి ఎంతో ఆప్తుడు..వైఎస్ చనిపోయిన తరువాత జగన్ కి కూడా ఎంతో సన్నిహితంగా మెలిగారు…అంతేకాదు వైఎస్ ఫ్యామిలీ కి ఎంతో నమ్మకమైన వ్యక్తిగా చోటు సంపాదించుకున్నారు..జగన్‌ జైలుకు వెళ్లినప్పుడు పార్టీకి, ఆ కుటుంబానికి ధైర్యాన్నిచ్చిన వ్యక్తి..అయితే …రాష్ట్ర విభజన విషయంలో జగన్‌ సోనియాతో రాజీపడటాన్ని సహించలేక పోయారు…దాంతో ఆరోజు నుంచీ జగన్ కి సబ్బం హరికి చెడిందనే చెప్పాలి…ఆ సమయంలోనే జగన్ కి సోనియాకి మధ్య జరిగిన రాజీ ఒప్పందాన్ని బట్టబయలు చేశారు..

అయితే చాన్నాళ్ళకి ఇప్పుడు సబ్బం మీడియా ముందుకు వచ్చారు..ఈసారి పవన్ కళ్యాణ్ ,మోడీ కి మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో వివరించి చెప్పారు..సబ్బం హరి మీద అనేక మందికి ఒక మంచి అభిప్రాయం ఉంది దాంతో సబ్బం హరి మాటల్లో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుందనేది చాలా మందికి నమ్మకం…విభజన సమయంలో ఆ నాడు, సోనియా, జగన్ ను ఎలా ఆడించిందో, ఇప్పుడు పవన్ ని ,మోడీ ఆడిస్తున్నారని అన్నారు..బీజేపి సహకారంతోనే టీడీపీపైనా, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లపైనా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విమర్శలు చేస్తున్నారని సబ్బం హరి అన్నారు…లోకేష్ నుంచీ టిడిపి నేతల వరకూ కూడా పవన్ చేసిన ఆరోపణలు అన్నీ మోడీ అండర్ లో జరుగుతున్నాయి అని అన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి ఒక పక్క అన్యాయం జరుగుతుంటే మరో పక్క రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఎలాంటి లబ్ది పొందాలోనని ఆలోచన చేస్తున్నాయని అన్నారు..సబ్బం హరి…చంద్రబాబు ఒక్కరే కేంద్రానికి ఎదురు నిల్చున్నారని..ఇలాంటి సమయంలో చంద్రబాబు కి అందరు అండగా నిలావాల్సింది పోయి వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు హరి…ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గ్రాఫ్ చాలా బాగుండేదని అయితే ఇప్పుడు తన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందని ఎద్దేవా చేశారు..పవన్ నిరాహార దీక్ష చేస్తానని చెప్పడం బీజేపి వ్యూహాలలో ఒకటిని అన్నారు సబ్బం హరి.