సిద్దార్థతో లవ్‌.. సమంత షాకింగ్‌ వ్యాఖ్యలు     2018-06-04   02:56:47  IST  Raghu V

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇటీవల ‘మహానటి’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఆ చిత్రంలో ఆమె జీవితాన్ని కళ్లకు కట్టారు. ఈ చిత్రం తనకు చాలా నేర్పిందని, ఆ సినిమా కారణంగా జీవితంలో మంచి నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చింది సమంత. ఇంకా మహానటి విషయమై పు విషయాలను సమంత చెప్పుకొచ్చింది.

కెరీర్‌ ఆరంభంలో సమంత హీరో సిద్దార్థతో ప్రేమలో పడ్డ విషయం తెల్సిందే. వారిద్దరు వివాహం చేసుకునేందుకు కూడా రెడీ అయ్యారు. ఇద్దరి మద్య దాదాపు సంవత్సరం పాటు ఘాడమైన ప్రేమ సాగింది. అయితే వీరిద్దరు ఏదో కారణం వల్ల విడిపోయారు. సిద్దార్థ్‌ గురించిన కొన్ని విషయాలు సమంతకు తెలియడం వల్ల ఆయన్ను వదిలేసిందనే టాక్‌ కూడా వినిపించింది. అయితే ఇప్పటి వరకు ఆయనతో ప్రేమ విషయంలో సమంత ఎప్పుడు కూడా క్లారిటీగా మాట్లాడలేదు. కాని ఎట్టకేలకు సమంత ఆ విషయమై ఇండైరెక్ట్‌గా మాట్లాడటం జరిగింది.