సావిత్రి మహానటి ఇందుకే అయ్యారు     2018-05-08   01:21:17  IST  Raghu V

తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత కాలం నిలిచిపోయే స్టార్స్‌ కొందరే ఉన్నారు. వారిలో సావిత్రి గారు ఒకరు అంటే ఖచ్చితంగా అందులో అతిశయోక్తి లేదు. తెలుగు సినిమా పరిశ్రమ ఆరంభం అయిన మొదట్లో సావిత్రి గారు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు తొలి తరం హీరోయిన్స్‌లో సావిత్రి గారు ముందు వరుసలో ఉంటారు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లతో పాటు అప్పటి స్టార్స్‌ అందరితో కూడా నటించి మెప్పించిన సావిత్రి కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. తమిళనాట అప్పటి సీనియర్‌ హీరోలకు సరిజోడీగా నటించి తమిళ హృదయాలను గెలుచుకున్నారు.

ఒక హీరోయిన్‌ లేదా హీరో స్టార్‌ అయ్యారు అంటే వారు మంచి సినిమాలు చేశారు అని, వారు చేసిని సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యి మంచి కలెక్షన్స్‌ను సాధించాయి అని చెప్పుకోవచ్చు. సినిమాల్లో మంచి సక్సెస్‌ అయితే స్టార్‌డం వచ్చేస్తుంది. కాని మహానటి అనే పేరు మాత్రం సావిత్రి గారికి కేవలం నటించడం వల్ల మాత్రమే రాలేదు. ఆమె జీవితంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలవడంతో పాటు, ఉన్నతమైన జీవితంను ఆమె జీవించారు. అందుకే ఆమెను మహానటి అంటూ అంతా పొగుడుతూ ఉంటారు. ఆమె మంచి నటి మాత్రమే కాకుండా మంచి మనిషి అవ్వడం వల్ల ఆమెను మహానటి అన్నారు అని చెప్పుకోవచ్చు.